ఇది పెట్టుబడిదారుల బడ్జెట్: CPM, CITU

by Disha News Web Desk |
ఇది పెట్టుబడిదారుల బడ్జెట్: CPM, CITU
X

దిశ, సిరిసిల్ల టౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు, బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మట్లాడుతూ.. బడ్జెట్‌లో రైతులకు, కార్మికులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఇది రైతు, కార్మిక వ్యతిరేక బడ్జెట్ అని, కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు లాభాలు చేసే విధంగా ఉన్నదని అన్నారు. ఎల్ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని అన్నారు.

వేతన జీవులకు నిరాశే: సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ

కేంద్రం ఇవాళ ప్రకటించిన బడ్జెట్ వేతన జీవులను నిరాశపరిచిందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ అన్నారు. కేవలం పెట్టుబడిదారులకు మాత్రమే అనుకూలంగా ఉందని అన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు, స్కీం వర్కర్లకు మొండిచేయి చూపిందన్నారు. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న చేనేత, టెక్స్‌టైల్ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు.

Advertisement

Next Story