- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ కావాలా.. కరెంటు కావాలా : కేటీఆర్
దిశ, సిరిసిల్ల : బీఆర్ఎస్ కు కంచుకోటలా ఉన్న సిరిసిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 11:20 నిమిషాలకు హెలికాప్టర్ లో సిరిసిల్లకు చేరిన కేటీఆర్ ముఖ్య నేతలతో కలిసి జిల్లా కేంద్రంలోని ఆర్డీవో ఆఫీస్ కి చేరుకొని 11:50 నిమిషాలకు నామినేషన్ దాఖలు చేశారు. కేటీఆర్ నామినేషన్ ప్రక్రియ ఊహించని విధంగా ఉంటుందనుకున్న జిల్లా ప్రజలకు, బీఆర్ఎస్ నిరాశే మిగిలింది. గెలుపుపై ధీమాతోనే ఏలాంటి హంగు ఆర్భాటం లేకుండా నామినేషన్ వేశామని అధికార పార్టీ నేతలు చెప్పుకుంటుంటే, ఓటమి భయంతోనే కేటీఆర్ సింపుల్ గా నామినేషన్ వేశారని ప్రతిపక్షాలు గుప్పిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కేటీఆర్ సింపుల్ నామినేషన్ ప్రక్రియ నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది..
కాంగ్రెస్ కావాలా కరెంటు కావాలా..
నామినేషన్ అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో కేటీఆర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకనాటి కాకతీయ సామ్రాజ్యం కర్ణాటకకు సామంతరాజ్యంగా కావాలా....కరెంటు కాలాల కాంగ్రెస్ కావాలా...నీళ్లు కావాలా కన్నీళ్లు కావాలా...కేసీఆర్ స్కీములు కావాలా...కాంగ్రెస్ స్క్యాములు కావాలా ఆలోచించండి అని కేటీఆర్ జిల్లా ప్రజలను విజ్ఞప్తి చేశారు. 55 ఎండ్లు అధికారం ఇచ్చిన ఏమీ చేయని కాంగ్రెస్ కు ఓటు వేస్తారా... సిరిసిల్లాను సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసిన నన్ను గెలిపిస్తారా ఆలోచించండన్నారు. తెలంగాణలో ప్రశ్నించే ఒకే ఒక గొంతు కేసీఆర్ ను అణిచివేయాలని రాహుల్ గాంధీ వస్తున్నాడని విమర్శించారు. పది ఏండ్ల పాలనలో కేసీఆర్ ఎన్నడూ కుల రాజకీయాలు, మత విద్వాంసాలకు తెర తీయలేదని, ఇప్పుడు కుల, మత పిచ్చి గాల్లను ఓటు వేసి గెలిపించి వాటికి తావిద్దామా ఆలోచించాలని కోరారు. రాజకీయంగా జన్మనిచ్చి రాష్ట్రంలో,దేశంలో, విదేశాల్లో గుర్తింపునిచ్చింది సిరిసిల్ల అని సిరిసిల్ల ప్రజల ప్రజా ప్రతినిధిగా చెప్పుకోవడానికి గర్వపడుతున్నానన్నారు.
15 ఏండ్లగా అవినీతి రహితంగా పని చేసి, సిరిసిల్ల ముఖ చిత్రం మార్చామన్నారు. ఐదవ సారి నామినేషన్ దాఖలు చేశానని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపు కోసం తిరుగుతున్నానని, గడప గడపకు తిరగక పోయిన ఇంటింటికి ప్రగతి నివేదిక పంపుతున్ననని, గులాబీ దండు నాకు అండగా ఉందని గౌరవ ప్రదమైన మెజార్టీతో గెలిపిస్తారని నమ్ముతున్నానన్నారు. గతంలో తప్పు చేసి 55 ఎండ్లు బాధపడ్డమని, మళ్ళీ తప్పు చేస్తే 50 ఏండ్లు బాధపడవలసి వస్తుందని గుర్తు చేశారు. ప్రలోభాలకు లొంగీ కాంగ్రెస్ కు ఓటు వేస్తే మళ్ళీ ఢిల్లీ మోచేతి నీళ్ళు తాగే పరిస్థితి వస్తుందని, సిరిసిల్ల ప్రజలు చైతన్య వంతమైన ప్రజలని, సిరిసిల్ల ప్రజల కోసం పనిచేసిన నన్ను మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు.