‘మాజీ ఎమ్మెల్యే రవి శంకర్ పై చర్యలు తీసుకోవాలి’

by Aamani |
‘మాజీ ఎమ్మెల్యే రవి శంకర్ పై చర్యలు తీసుకోవాలి’
X

దిశ, వేములవాడ : వేములవాడ పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే రవి శంకర్ పై కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ నిబంధనలకు విరుద్ధంగా తన వాహనంపై ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించుకొని తిరుగుతున్నారని ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ మహమ్మద్ అహ్మద్ పాషా మంగళవారం రాత్రి వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మంగళవారం వేములవాడలో పర్యటించిన సందర్భంలో టీ.ఎస్ 02 ఈ.హెచ్ 4444 నెంబర్ కలిగి ఉన్న తన వాహనంపై గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన కాలానికి సంబంధించి స్టిక్కర్ కనిపించిందని, తన పదవీకాలం ముగిసి సంవత్సరం గడుస్తున్న ఇప్పటికి ఆయన ఎమ్మెల్యే స్టిక్కర్ తోనే పర్యటన కొనసాగిస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని, వెంటనే ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed