- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Collector : సఖి వన్ స్టాప్ కేంద్రం ద్వారా అందించే సేవలు విస్తృతంగా ప్రచారం కల్పించాలి..
దిశ, పెద్దపల్లి : సఖి వన్ స్టాప్ కేంద్రాల ద్వారా అందించే సేవల పై విస్తృతంగా మహిళలకు అవగాహన కల్పించడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న సఖి కేంద్రం, తెనుగు వాడలోని అంగన్వాడీ కేంద్రం, శ్రీనివాస థియేటర్ సమీపంలో గల బాలల రక్ష భవన్ ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న వివిధ వేధింపులు, హింసల నుండి రక్షణ కల్పించడానికి వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించడానికి సఖి వన్ స్టాప్ సెంటర్ కృషి చేస్తుందని అన్నారు.
సామాజిక మాధ్యమాల ద్వారా సఖికేంద్రం ద్వారా అందిస్తున్న సేవలకు ప్రచారం కల్పించాలని, ప్రతి మహిళకు సఖి కేంద్రం పట్ల అవగాహన వచ్చే విధంగా కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. సఖి వన్ స్టాప్ కేంద్రం ద్వారా బాధిత మహిళకు తక్షణ సహాయంగా కౌన్సిలింగ్, వైద్య సహాయం, తాత్కాలిక వసతి, న్యాయ సహాయం, పోలీస్ సహాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పూర్వ ప్రాథమిక విద్యాకేంద్రాలుగా అంగన్వాడీ కేంద్రాలు పనిచేయాలని, ఇందులో భాగంగా ప్రతిరోజు నిర్దేశించిన కార్యక్రమాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు. బాలల రక్షభవన్ పరిశీలించిన కలెక్టర్ సంబంధిత కార్యాలయం రికార్డులు ఆన్ లైన్ లో నమోదు చేయాలని, భవన్ నుంచి చేపట్టాల్సిన హోమ్ విజిట్ లను తెలియజేస్తూ బోర్డు ఏర్పాటు చేయాలని, రెగ్యులర్ గా హొమ్ విజిట్ చేయాలని కలెక్టర్ తెలిపారు.
అనంతరం జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న సఖికేంద్రం భవనాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రహరీ గోడ, గేట్ ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ ఉన్నపనులు త్వరితగతిన పూర్తిచేసి సఖి కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొని రావాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రంగంపల్లిలో ఉన్నబాయ్స్ హాస్టల్ ను కలెక్టర్ సందర్శించి నిర్వాహకులకు పలుసూచనలు చేశారు. ఈ పర్యటనలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.