చరిత్ర సృష్టించాం.. చర్చకు సిద్ధమా..?: సీఎం రేవంత్ రెడ్డి సవాల్

by srinivas |   ( Updated:2024-12-04 14:18:40.0  )
చరిత్ర సృష్టించాం.. చర్చకు సిద్ధమా..?: సీఎం రేవంత్ రెడ్డి సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: తమ పాలనపై విమర్శలు చేస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పెద్దపల్లి(Peddapally)లో నిర్వహించిన యువవికాస సభ(Yuva Vikasa Sabh)లో పాల్గొన్న ఆయన.. బీఆర్ఎస్, బీజేపీ నాయకులపై మండిపడ్డారు. ప్రజాపాలన ఉంది కాబట్టే విజ్ఞప్తులు వస్తున్నాయని, ప్రజల కోసం కాంగ్రెస్(Congress) ప్రభుత్వం కష్టపడి పని చేస్తోందని చెప్పారు. కడుపుమంటతో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల పాటు ప్రజలను మోసం చేసి.. ఇప్పుడు బజారెక్కి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శత్రువుల విష ప్రచారాన్ని తిప్పి కొడతామన్నారు. బోనస్‌తో వరి రైతులు అత్యధికంగా లాభపడ్డారని తెలిపారు. ఏడాది కాలంలోనే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చి రికార్డ్ సృష్టించామన్నారు. గుజరాత్ లో ఏ సంవత్సరంలోనైనా 55 వేల ఉద్యోగాలు ఇచ్చారా అని, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్(Union Ministers Kishan Reddy and Bandi Sanjay) సమాధానం చెప్పాలని నిలదీశారు. ఉద్యోగాల కల్పనపై చర్చకు సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

మాజీ సీఎం కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపైనా సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అసలు కాలేశ్వరం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. కుక్క తోక తగిలి పందిరి కూలినట్టుగా కాళేశ్వరం పరిస్థితి ఉందని సెటైర్లు వేశారు. ఊళ్లమీద పడి మాట్లాడటం కాదని, ప్రాజెక్టులపై లెక్కలు తీయడానికి కేసీఆర్ సిద్ధమా అని రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు

Advertisement

Next Story

Most Viewed