అన్నదమ్ముల ఆస్తి తగాదాలు.. వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన

by Sathputhe Rajesh |
అన్నదమ్ముల ఆస్తి తగాదాలు.. వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన
X

దిశ , కోనరావుపేట: ఒకే తల్లి కడుపులో పుట్టి పెరిగి,ఒకే రక్తాన్ని పంచుకున్న అన్నదమ్ములు ఈరోజు పైసా కోసం మానవత్వాన్ని మరిచి అస్తి తగాదాలతో రోడ్డెక్కిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మమిడిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మామిడిపల్లికి చెందిన బడుగు భూమయ్య ,బడుగు నర్సయ్య అనే అన్నదమ్ములకు గత కొంతకాలంగా జరుగుతున్న ఆస్తి తగాదాలతో ఆదివారం భూమయ్య కుటుంబం ,ఇంద్ర,శ్వేత,చిట్టి రాహుల్ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తమకు న్యాయం చేయాలంటూ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. భూమయ్య తెలిపిన వివరాల ప్రకారం.. తన ఆన్న నర్సయ్య ,తనకు 20 సంవత్సరాల కిందటే తన తల్లితండ్రులు పంచిచ్చిన ఆస్తి విషయంలో గత కొంతకాలంగా నర్సయ్య ఇంకా తమకు ఆస్తి కావాలని గొడవలు పెడుతూ తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెబుతున్నారు. నోటికి వచ్చినట్టు తిడుతూ మానసికంగా టార్చర్ చేస్తూ వస్తున్నాడని, అలాగే ఈరోజు కూడా తమ ఇంట్లోకి దౌర్జనంగా వచ్చి ఇంట్లోని సామాను, టీవీ ,బట్టలు అన్నీ బయటపడేసి నిప్పంటించి, నన్ను నా భార్యని కొట్టారని చెబుతున్నారు. ఈ గొడవలను భరించలేకే మనస్థాపం చెంది తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుందామనే ఆవేదనతో వాటర్ ట్యాంక్ ఎక్కామని, తమకు తగిన న్యాయం జరిగేలా చూడాలని నిరసన చేస్తూ కోరారు.సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ ఐ ప్రేమ్ దీప్ భూమయ్య కుటుంబానికి నచ్చజెప్పి వారికి తగిన న్యాయం జరిగేలా చేస్తాం అని హామీ ఇచ్చారు.

Advertisement
Next Story

Most Viewed