MLC Jeevan Reddy : చేప పిల్లలకు బదులుగా నగదు పంపిణీ చేయాలి

by Sridhar Babu |
MLC Jeevan Reddy : చేప పిల్లలకు బదులుగా నగదు పంపిణీ చేయాలి
X

దిశ, జగిత్యాల టౌన్ : రాష్ట్రంలో మత్స్యకారులకు చేప పిల్లలకు బదులుగా వాటి విలువను నగదు పంపిణీ చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. పంపిణీ చేసే చేప పిల్లలు నాణ్యత, సైజు, సంఖ్య లెక్కకు సంబంధించి నిబంధనలు పాటించడం కష్టసాధ్యమని అన్నారు. ప్రభుత్వపరంగా రాయితీతో పంపిణీ చేయతలపెట్టే చేప పిల్లలను చెరువుల నీటి నిలువ, విస్తరణ ను పరిగణలోకి తీసుకొని నగదు రూపకంగా గ్రాంట్ చేయగలిగితే ప్రభుత్వం ఆశించిన ఫలితాలు పొందే అవకాశం ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed