- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెద్దపల్లిలో బీఆర్ఎస్కు బిగ్ షాక్.. BJPలో చేరిన BRS MLA
పెద్దపల్లిలో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగలనుంది. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లుతోపాటు పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలువాక రాజయ్య, సుల్తానాబాద్ మాజీ ఎంపీపీ పాల రామారావుతోపాటు పలువురు సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సర్పంచులతో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్దమైంది. ఆగస్టు 4న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలకు ముహుర్తం ఖారారైంది. ఈ పరిణామం పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్‌గా భావిస్తున్నారు. 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాజయ్యకు కనీసం కౌన్సిలర్ టికెట్ ఇవ్వకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేపై అసంతృప్తిగా ఉన్నారు. అయితే నాయకులు పార్టీ మారడానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై ఉన్న అసంతృప్తే కారణమనే ప్రచారం జరుగుతోంది. కాగా, అధికార పార్టీ నేతలు చేరికలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారే నేతలకు పదవులతోపాటు పెద్ద మొత్తంలో డబ్బు సైతం ఇస్తామని బేరసారాలకు దిగినట్లు సమాచారం.
దిశ, కరీంనగర్ బ్యూరో : పెద్దపల్లి బీఆర్ఎస్ ఆపార్టీ నేతలు బిగ్‌షాక్ ఇవ్వనున్నారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లుతో పాటు పెద్దపల్లి మాజీ మున్సిపాల్ చైర్మన్ ఎలువాక రాజయ్య, సుల్తానాబాద్ మాజీ ఎంపీపీ పాల రామారావుతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్దమైయింది. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణ రావు ఆధ్వర్యంలో ఆగస్టు 4వ తేదినా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమీక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అధికార పార్టీకి చెందిన సర్పంచులు పెద్ద సంఖ్యలో చేరుతుండటంతో నియోజకవర్గంలో హాట్ టాఫిక్‌గా మారింది. వీరి చేరికలకు ముహుర్తం ఫిక్స్ కాగా బీఆర్ఎస్ పార్టీకి పెద్దపల్లి నియోజకవర్గంలో భారీ షాక్ తగలనుంది.
అసంతృప్తితోనే..
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేతలు అందరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవరించిన వారే. మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు బీఆర్ఎస్ పార్టీకి అనుకులంగా పని చేయగా పెద్దపల్లి తొలి మున్సిపల్ చైర్మన్‌గా రాజయ్య ఎన్నికయ్యారు. 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాజయ్యకు కనీసం కౌన్సిలర్ టికెట్ ఇవ్వకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేపై అసంతృప్తిగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సుల్తానాబాద్ జెడ్పీటీసీగా బీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేసి ఓటమి చెందిన పాల రామారావు ఇప్పుడు పార్టీ మారుతున్నారు. పెద్దపల్లి మండలానికి చెందిన కీలక గ్రామాల సర్పంచులతోపాటు సుల్తానాబాద్ మున్సిపాల్ పరిధిలోని పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్ల పార్టీ మారడానికి స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మీద ఉన్న అసంతృప్తే కారణమనే ప్రచారం జరుగుతోంది.
అడ్డుకోవడానికి ప్రయత్నాలు..
బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్యనాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు నియోజకవర్గంలో పెద్దఎత్తున ప్రచారం జరగడంతో చేరికలను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరగుతున్నాయి. పార్టీ మారే నేతలకు పదవులతోపాటు పెద్ద మొత్తంలో డబ్బు సైతం ఇస్తామని అధికార పార్టీ నేతలు బేరసారాలకు దిగినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ పెద్దలతో సైతం ఫోన్లో మాట్లాడిచినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహుర్తం ఖారారైనప్పటికీ అడ్డుకోవడానికి చివరి నిముషం వరకు అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తుండడం విశేషం.