చక్రధర్ గౌడ్ కార్యాలయంపై దాడికి యత్నించింది బీజేపీ కార్యకర్తలే: ఏసీపీ దేవారెడ్డి

by Shiva |
చక్రధర్ గౌడ్ కార్యాలయంపై దాడికి యత్నించింది బీజేపీ కార్యకర్తలే: ఏసీపీ దేవారెడ్డి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: బీజేపీలో చేరిన చక్రధర్ గౌడ్ ను కలిసేందుకు ప్రయత్నించినా కలువ కుండా.. ఓ వర్గం వారికే అవకాశం ఇస్తుడడంతో అగ్రహించిన కొందరు బీజేపీ నాయకులే ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ కార్యాలయం పై దాడి యత్నించినట్లు విచారణలో వెల్లడైందని ఏసీపీ దేవారెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ వివరాలు వెల్లడించారు.

చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు సీసీ పుటేజ్ అధారంగా విచారణ చేపట్టినట్లు తెలిపారు. సీసీ పుటేజ్ లో వాహనాల నెంబర్ల ఆధారంగా కొట్టె నరేంద్ర, వరుకోలు విజయ్, బోనగిరి హరీష్, బూరుగు ఆదిత్య రాం, బండి హర్షవర్ధన్ లను అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు. విచారణలో చక్రధర్ గౌడ్ ను కలిసేందుకు యత్నించగా ఓ వర్గానికే అధిక ప్రాధాన్యం ఇస్తూ కలువకపోవడంతో కార్యాలయానికి నిప్పు పెట్టి దాడి చేయాలని నిర్ణయించుకొని వచ్చినట్లు విచారణలో తెలిందన్నారు.

ఈ మేరకు నిందితుల వద్ద రెండు మోటారు సైకిళ్లు, ఐదు సెల్ ఫోన్లు రికవరీ చేసి, జూడిషియల్ రిమాండ్ కు తరలించనున్నట్లు ఏసీపీ తెలిపారు. ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ కార్యాలయం పై దాడికి యత్నించింది బీజేపీ నాయకులైనప్పటికీ ప్రజాశాంతికి భంగం కలిగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత పోస్టులు పెట్టి, ప్రజల భద్రత, ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏసీపీ దేవారెడ్డి హెచ్చరించారు.

Advertisement

Next Story