- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంసీహెచ్ లో మెరుగైన చికిత్స అందించాలి
దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్ లో మెరుగైన చికిత్స అందించాలని, అందుకు తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎంసీహెచ్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురు గర్భిణులను, బాలింతలను వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. క్లిష్ట సమయంలో డెలివరీ చేసి తల్లితోపాటు శిశువు ప్రాణాలను కాపాడిన వైద్య సిబ్బందిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంతో పోల్చితే ఎంసీహెచ్ లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు.
మెరుగైన వైద్య సేవల కారణంగా బెడ్లు సరిపోని పరిస్థితి ఏర్పడిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విద్య, వైద్యం, వ్యవసాయం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, త్వరలోనే ఎంసీహెచ్ లో పది కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీ గా ఉన్న వైద్య పోస్టుల నియామకం పై డీఎంఈ తో ఫోన్ లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా.రాములు,హెచ్ఓడీ అరుణ, ఆర్ఎంఓ యాకుబ్ పాషా, డా.గీతిక, నాయకులు బోనగిరి నారాయణ, భూపెళ్లి శ్రీనివాస్, శేఖర్, వైద్యులు, పారామెడికల్ స్టాఫ్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
- Tags
- MLA Sanjay Kumar