సమస్యలు తెలుసుకుంటూ కొనసాగుతున్న Bandi Sanjay పాదయాత్ర

by sudharani |   ( Updated:2022-12-11 08:43:42.0  )
సమస్యలు తెలుసుకుంటూ కొనసాగుతున్న Bandi Sanjay పాదయాత్ర
X

దిశ, కోరుట్ల రూరల్ : ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపడుతున్న పాదయాత్ర ఆదివారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి ప్రారంభమయ్యింది. వెంకటాపూర్ నుండి మోహన్ రావు పేట వరకు సాగిన పాదయాత్రలో ఆయా గ్రామాల ప్రజలు బండి సంజయ్‌కు ఘన స్వాగతం పలికారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టడం జరిగిందని, ప్రజా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించేంతా వరకు తాను పోరాటం కొనాసాగిస్తాన్ని అన్నారు. పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసా కల్పిస్తూ బండి సంజయ్ ముందుకు సాగుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed