Sabbitham Falls : సబ్బితం జలపాతం సందర్శనకు నిషేధం..

by Sumithra |
Sabbitham Falls : సబ్బితం జలపాతం సందర్శనకు నిషేధం..
X

దిశ, పెద్దపల్లి : పెద్దపెల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలోని సబ్బితం జలపాతం సందర్శనకు వచ్చే పర్యటకులకు నిషేధం విధించినట్లు బసంత నగర్ ఎస్ఐ స్వామి తెలిపారు. శుక్రవారం సబ్బితం గ్రామాన్ని ఆయన సందర్శించారు. నిరంతర వర్షపాతం కారణంగా జలపాతానికి వెళ్లే దారిలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. జలపాతాన్ని సందర్శించ వద్దని అక్కడ ఫ్లెక్సీలను, సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. జలపాతం వద్ద బందోబస్తును ఏర్పాటు చేసినట్లు అక్కడ పరిస్థితి ప్రశాంతంగా ఉన్నట్లు ఎస్సై తెలిపారు.



Next Story