అది జరగకపోతే.. నా చావుకు డిపిఓ, ఎంపీడీవోలే కారణం.. గ్రామ సర్పంచ్ ఆడియో

by Mahesh |   ( Updated:2023-05-19 11:17:29.0  )
అది జరగకపోతే.. నా చావుకు డిపిఓ, ఎంపీడీవోలే కారణం.. గ్రామ సర్పంచ్ ఆడియో
X

దిశ, రామడుగు: గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామ సర్పంచ్ మేఘరాజ్ ఆడియో వైరల్‌గా మారింది. గెలిచి నాలుగు సంవత్సరాలు అయిన ఇప్పటికి గ్రామానికి సెక్రటరీ లేడు. సెక్రటరీ లేకపోవడం వలన గ్రామ అభివృద్ధి కుంటు పడుతుంది. గ్రామ సెక్రటరీని వారం రోజుల్లో నియమించకపోతే ఆత్మహత్య చేసుకుంటాను. నా చావుకి కారణం జిల్లా పంచాయతీ అధికారి, మండల అభివృద్ధి అధికారి, ఎపివో‌లు కారణం. అని తన ఆవేదనని సోషల్ మీడియా గ్రూపులలో సర్పంచ్ పోస్ట్ చేశాడు. వైకుంఠ ధామం నిర్మించి సంవత్సరం అయిన ఇంకా రికార్డు చేయలేదు. సెగ్రెషన్ షెడ్డు కట్టి నిర్మించిన తర్వాత భారీ వర్షాలకి కూలిపోయింది.

అధికారులు మెడ మీద కత్తి పెట్టి మళ్ళీ నిర్మించాలని ఒత్తిడి తీసుకు వస్తే మళ్ళీ నిర్మించాను. కానీ ఇప్పటివరకు రికార్డు చేయలేదు. క్రీడా ప్రాంగణం అరవై నాలుగు వేలు పెట్టి నిర్మిస్తే నలభై రెండు వేలు రికార్డు చేశారు. పదిహేను రోజులలో నా పని పూర్తి చేయకపోతే మండల అభివృద్ధి కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటాను. నా చావు తో నైనా అందరు సర్పంచులకి న్యాయం జరుగుతుందని తన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం సర్పంచ్ ఆడియో రాష్ట్రవ్యాప్తంగా వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతుంది.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed