- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సహజీవనం పేరుతో మోసం చేసిందని మహిళపై మరో మహిళ ఫిర్యాదు
దిశ, జగిత్యాల ప్రతినిధి: సహజీవనం పేరుతో నమ్మించి తనని మోసం చేసిందంటూ ఓ వికలాంగురాలైన మహిళ మరొక మహిళపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఘటన మల్లాపూర్ మండలం వాల్కొండ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వాల్కొండ గ్రామంలో ఓ వికలాంగ మహిళ తన పక్కింట్లో ఉండే మరో మహిళ సహజీవనం పేరుతో తనను మోసం చేసిందని ఆరోపించింది. అంతే కాకుండా సదరు మహిళ తన నుంచి రూ.35లక్షలు తీసుకుందని మహిళా వికలాంగురాలు ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేసింది.
ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యంతో వికలాంగ మహిళ సదరు మహిళకు రూ.11 లక్షల వరకు ఫోన్ పేతో, మరో రూ.23 లక్షలు నగదు రూపంలో ఇచ్చినట్లు బాధితురాలు తెలిపింది. ఈ క్రమంలో సదరు మహిళ తనను మోసం చేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే కాకుండా డబ్బు తిరిగివ్వమని అడిగితే గూండాలతో విచక్షణా రహితంగా కొట్టించిందని వాపోయింది. ఈ విషయమై మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వికలాంగ మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. జగిత్యాలలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలికి జగిత్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ పోరాట సమితి అధ్యక్షులు లంక దాసరి శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు.