- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిరుపేదలకు పౌష్టికాహారం అందించడమే ఆహార భద్రత కమిషన్ లక్ష్యం...
దిశ, గన్నేరువరం : నిరుపేదలకు పౌష్టికాహారం అందించడమే ఆహార భద్రత కమిషన్ లక్ష్యం అని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యులు ఓరగంటి ఆనంద్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్, జంగపల్లి గ్రామాలలో రేషన్ దుకాణాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను ఆయన ఫుడ్ కమిషన్ సభ్యురాలు భారతి, అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల కొండాపూర్ లో రేషన్ షాప్ నిర్వహణ సరిగాలేదని, జంగాపెళ్లి అంగన్వాడీ కేంద్రంలో స్టాక్ వివరాలు, జంగపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిర్వాహకుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ముచ్చటించి వారి ఆరోగ్య పరిస్థితిని, భోజన మెనూ వివరాలను అడిగి తెలుసుకు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రతి పౌరునికి పౌష్టికాహారం అందడం అని, దీని కోసం అధికారులు సమిష్టి కృషి చేయాలని సూచించారు. పౌష్టికాహారం అందించడానికి ఆహార భద్రత కమిషన్ ఏర్పాటు చేశారు. అంగన్వాడి కేంద్రాలను గర్భిణీ స్త్రీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు పౌష్టికాహార లోపంతో ఉండకూడదని బాల్యంలో సరైన ఆహారం తీసుకుంటేనే రాబోయే తరాలకు గడ్డి పునాది వేసిన వాళ్ళు అవుతారని అన్నారు. రక్తహీనతను అధిగమించాలని సూచించారు. మండలంలో తన దృష్టికి వచ్చిన అంశాలను జిల్లా కేంద్రంలో జరిగే రివ్యూ మీటింగ్ లో ప్రస్తావించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పౌష్టికాహారం అందించే విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఆహార భద్రత కమిషన్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేశ్వర్, డీఈఓ జనార్దన్ రావు, డీఎస్ఓ నరసింహారావు, డీఎం రజనీకాంత్, డీఆర్డీఓ శ్రీధర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ సునీత, తహశీల్దార్ ఇప్ప నరేందర్, ఎంఈఓ రామయ్య తదితరులు పాల్గొన్నారు.