- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభివృద్ధి పనులకు భూ కేటాయింపులు నిర్వహించాలి
దిశ,మంథని : మంథని పట్టణంలో చేపట్టే అభివృద్ధి పనులకు అవసరమైన భూ కేటాయింపులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కోరారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంథని పట్టణంలో ఉన్న ప్రభుత్వ భూములను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె.అరుణ శ్రీ తో కలిసి పరిశీలించారు. కాటారం క్రాస్ రోడ్ వద్ద గల పాత డంపింగ్ యార్డ్ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ భూమి లెవెలింగ్ పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. అంబేద్కర్ కాలనీలోని బర్రెకుంట చెరువు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంథనిలోని మల్లేపల్లి డిగ్రీ కళాశాల సమీపంలో గల 5 ఎకరాల ప్రభుత్వ స్థలం, చైతన్యపురి కాలనీలోని బాయ్స్ హైస్కూల్, గర్ల్స్ హైస్కూల్, వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న దేవాదాయ శాఖ పరిధిలోని ప్రభుత్వ భూమిని కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ మంథని పట్టణంలో సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్, నూతన పురపాలక భవనం, సబ్ స్టేషన్, నూతన రెవెన్యూ డివిజన్ అధికారి, తహసీల్దార్ అధికారి కార్యాలయాల నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టుటకు వీలుగా అనువైన ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మంథని పట్టణంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల స్కెచ్ లను పూర్తి చేసి, ఏ అభివృద్ధి కార్యక్రమానికి ఎక్కడ వీలుగా ఉంటుందో వివరాలతో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అంతకు ముందు రామగిరి మండలంలోని రాజాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం పేట గ్రామానికి సంబంధించి 708 ఎకరాల సింగరేణి భూసేకరణ ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మంథని రెవెన్యూ డివిజన్ అధికారి వి.హనుమానాయక్, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.