- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గన్నేరువరంలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం..
దిశ, గన్నేరువరం : రైతులకు న్యాయ సహాయార్థం, సమస్యల పరిష్కారం కోసమే అగ్రిలీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సుజయ్ తో కలిసి అగ్రీలీగల్ ఎయిడ్ క్లినిక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుప్రీంకోర్టు సూచనల మేరకు గుర్తించబడిన గ్రామాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ క్లినిక్ లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రైతులు పంటల సాగులో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, రైతుల సమస్యలను తానుస్వయంగా చూసానని అన్నారు. ప్రకృతి సిద్ధమైన ఎరువుల తయారీ కోసం పశువుల పెంపకాన్ని గ్రామాల్లో ప్రోత్సహించి, సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం జరిగేలా అధికారుల ప్రోత్సహించాలని అన్నారు.
పర్యావరణ సమతుల్యం దెబ్బతింటే మనిషి మనగడకే ప్రమాదమని, రైతు క్షేమమే దేశ క్షేమం అని కొనియాడారు. పారిశుద్ధ్యంలో జాతీయ పురస్కారాన్ని అందుకున్న గన్నేరువరం పాలకవర్గానికి, గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపారు. గన్నేరువరం మండల పర్యటనలో భాగంగా జిల్లా జడ్జి కాసింపేట మానస దేవి ఆలయం, పారువెల్ల లక్ష్మీ గణపతి ఆలయాలను దర్శించుకోగా ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిజ కోహిర్ కార్, జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్, జిల్లా ఆర్బీఎస్ కోఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి, సర్పంచ్ పుల్లెల లక్ష్మీ లక్ష్మణ్ ఏవో కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.