- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో పట్టుపడితే కేసులు తప్పవు.. డీఎస్పీ ఏ.రాములు
దిశ, కోరుట్ల : కోరుట్ల, మెట్ పల్లి డివిజన్ పరిధిలో నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తామని, డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో పట్టుపడితే కేసులు నమోదు చేస్తామని మెట్ పల్లి డీఎస్పీ ఏ.రాములు అన్నారు. సోమవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్టాన్ని అతిక్రమించి డిసెంబర్ 31 రాత్రి రోడ్లపైన కేకులు కట్ చేయడం, బాణాసంచాలు పేల్చడం చట్టరీత్యా నేరమన్నారు.
మద్యం తాగి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్థుల పై దాడులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని అన్నారు. తల్లిదండ్రులు తమపిల్లల భవిష్యత్తు పాడవకుండా డ్రైవింగ్ చేయకుండా చూసుకునే బాధ్యత తీసుకోవాలని లేదంటే కేసులు నమోదైతే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. డివిజన్ ప్రజలకు ప్రతి ఒక్కరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సమావేశంలో అన్నారు.