Collector : ఎల్.ఆర్.ఎస్ క్రమబద్దీకరణ త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు..

by Kalyani |
Collector : ఎల్.ఆర్.ఎస్ క్రమబద్దీకరణ త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు..
X

దిశ, పెద్దపల్లి : జిల్లాలో పెండింగ్ ఉన్న ఎల్.ఆర్.ఎస్ క్రమబద్దీకరణ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేసేందుకు పక్కా కార్యాచరణతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కలెక్టరేట్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ… జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు, కార్పొరేషన్ పరిధిలో మనకు వచ్చిన ఎల్.ఆర్.ఎస్ క్రమబద్దీకరణ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని, దరఖాస్తుదారులను నేరుగా లేదా ఫోన్ ద్వారా సంప్రదించి అవసరమైన సమాచారం సేకరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని రెవెన్యూ, నీటిపారుదల శాఖ, టౌన్ ప్లానింగ్ అధికారులు వారి లాగిన్ పరిధిలో ఉన్న ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం ఉన్న లేఔట్ల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని, లాగిన్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, టౌన్ ప్లానింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed