పొదల్లోకి దూసుకెళ్లిన బొలెరో వాహనం.. ఆర్టీసీ ఆఫీసర్లకు తప్పిన ప్రమాదం

by Aamani |
పొదల్లోకి దూసుకెళ్లిన బొలెరో వాహనం.. ఆర్టీసీ ఆఫీసర్లకు తప్పిన ప్రమాదం
X

దిశ,తల్లాడ: ఆగి ఉన్న లారీని స్వల్పంగా ఢీకొని ఆర్టీసీ ఆఫీసర్లు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం సోమవారం తెల్లవారుజామున తల్లాడ ఎన్టీఆర్ కాలనీ వద్ద జరిగింది. విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ విజిలెన్స్ ఆఫీసర్లు తనిఖీల్లో భాగంగా తల్లాడ రింగ్ సెంటర్లో వాహనాల తనిఖీ చేశారు. అనంతరం విజయవాడకు తిరుగు ప్రయాణంలో ఎన్టీఆర్ కాలనీ వద్ద ఎదురుగా ఆగి ఉన్న లారీని స్వల్పంగా ఢీకొని అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో ఆఫీసర్లకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తెల్లవారిజామున ట్రాక్టర్ల సహాయంతో బొలెరో వాహనాన్ని బయటకు తీశారు. తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డామని విజిలెన్స్ ఆఫీసర్లు బి వెంకటేశ్వర్లు, పి శ్రీనివాస రావులు తెలిపారు. కాగా ఎన్టీఆర్ కాలనీ వద్ద రోడ్డుకు ఆనుకొని కొన్ని బెల్టు షాపులు, హోటల్ ఉండటంతో లారీలు, ఇతర వాహనాలు ఇష్టం వచ్చిన రీతిలో నిలుపుదల చేస్తున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed