అగ్నిప్రమాదంలో గడ్డితో సహా లారీ దగ్ధం..

by Sumithra |
అగ్నిప్రమాదంలో గడ్డితో సహా లారీ దగ్ధం..
X

దిశ, గొల్లపల్లి : గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో అగ్నిప్రమాదం జరుగగా గడ్డితో సహా లారీ దగ్దం అయ్యింది. వివరాల్లోకి వెళితే మెటుపల్లి నుండి మల్లన్నపేటకి బీమ సురేష్ అనే రైతు ఎండుగడ్డి లోడు తీసుకువస్తున్న క్రమంలో లారీకి ప్రమాదవశాత్తూ విద్యుత్తు తీగలు తగిలి షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ఉన్నప్రజలు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తం అయిన రైతు ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయడంతో హుటాహుటిన అక్కడికి వచ్చిన ఫైర్ ఇంజన్ మంటలార్పింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

Next Story