- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కూతురే కొడుకైన వేళ.. కన్నీరు పెట్టించిన రోడ్డు ప్రమాద ఘటన
దిశ, పెద్దపల్లి: చనిపోయిన రోజు తల్లిదండ్రులకు తలకొరివి పెట్టడానికి ఒక కొడుకు ఉండాలని అంటారు. కొడుకు పుట్టకుండ బిడ్డలు పుడితే మనసు లో కాస్తా బాధ ఉన్నప్పటికీ మహలక్ష్మీ అనుకొని మనస్సు తృప్తి చేసుకుంటారు. కన్న తల్లిదండ్రులకు ఆపద వచ్చినప్పుడు తాను ఆడపిల్లనా.. మగ పిల్లవాడినా తేడా లేకుండ సపరియలు చేయడంతో పాటు కన్న వాళ్లు మరణిస్తే తలకొరివి పెట్టి తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటున్న సంఘటన ఇటీవల చాలా చూస్తున్నాం.
కూతురే కొడుకై తండ్రికి తలకొరివి పెట్టిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దపల్లి మండలంలోని గొల్లపల్లికి చెందిన కు రవి గురువారం తన ద్విచక్ర వాహనం పైన భార్యతో కలిసి వస్తున్నాడు. పెద్దపల్లి నుంచి మంథని వైపు ఉన్న ప్లైఓవర్ బిడ్జ్రి వద్ద లారీ కింద పడి రవి రెండు కాళ్లు విరిగిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. 108 వాహనంలో రవిని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో రవి మృతి చెందాడు. మృతి చెందిన రవి అత్యక్రియలు శుక్రవారం గొల్లపల్లి గ్రామంలో నిర్వహించగా రవికి కొడుకులు లేకపోవడంతో కూతురు సింధూజ తండ్రికి తలకొరివి పెట్టింది. చిన్న వయస్సులోనే తండ్రికి కొల్పొయిన సిందూజా తండ్రికి అగ్గి పట్టడం అత్యక్రియలకు హాజరైన అందర్ని కలిచివేసింది.