- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుడ్‌న్యూస్: జిల్లాల్లో ఇవాళ్టి నుంచే ప్రారంభం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి అన్ని జిల్లాల్లో కంటి వెలుగు క్యాంపులు ప్రారంభం కానున్నాయి. ఆధార్‌కార్డు వివరాలతో రిజిస్ట్రేషన్ చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు. అంధంత్వ నివారణే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కేవలం 100 రోజుల్లో కోటిన్నర మందికి పరీక్షలు పూర్తి చేసి అద్దాలు, ఆపరేషన్లు నిర్వహించాలని సర్కార్లక్ష్యం పెట్టుకున్నది. సమర్థవంతంగా ఈ టాస్క్‌ను పూర్తి చేసుకొని గిన్నిస్‌బుక్‌లో రికార్డు సొంతం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోన్నది. వారంలో ఐదు రోజుల పాటు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్యాంపులు కొనసాగనున్నాయి. ఒక మెడికల్ ఆఫీసర్‌తో పాటు మరో ఏడుగురు మెంబర్లు కలిపి ఒక టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఆప్ట్రోమెట్రిస్ట్, సూపర్ వైజర్ఆఫీసర్, ఇద్దరు ఏఎన్ఎంలు, ముగ్గురు ఆశాలు, ఒక డీఈవోలు టీమ్‌లో ఉండనున్నారు. పూర్తిగా ఏఆర్మిషన్తో కంప్యూటీకరణ విధానంలో ప్రజలకు పరీక్షలు చేయనున్నారు. పరీక్షలు తర్వాత కేవలం రెండు వారాల్లో ఏఎన్ఎంలు అద్దాలు పంపిణీ చేయనున్నారు. ఇక పరీక్షల క్వాలిటీ చెక్‌చేసేందుకు జిల్లాకో కంట్రోల్టీమ్పనిచేయనున్నది. ప్రతీ టీమ్‌కు ఓ వాట్సాప్‌గ్రూప్‌ను క్రియేట్ చేశారు. రోజులో చేసిన కంటి పరీక్షలు, అద్దాలు పంపిణీ, సర్జరీల రిఫర్లు వంటి వివరాలను ఆ గ్రూప్‌లో సాయంత్రానికి పోస్టు చేయాల్సి ఉంటుంది.
అద్దెకు వాహనాలు
కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం అద్దెకు వాహనాలను తీసుకొని టీమ్‌లకు సమకూర్చినది. గవర్నమెంట్ వద్ద వెహికల్స్లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. గురువారం నుంచి షురూ కానున్న కంటి వెలుగు కార్యక్రమం జూన్ 15 వరకు జరుగుతుంది. ఓవరల్‌గా 12,768 రూరల్ ప్రాంతాల్లో, 3788 అర్బన్ ప్రాంతాలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గ్రామ పంచాయితీ, వార్డుల వారీగా టెస్టింగ్ప్రాసెస్ను నిర్వహిస్తారు. ఒక్కో రోజు క్యాంపు నిర్వహణకు ప్రభుత్వ టీమ్‌కు రూ. 1500 చొప్పున అలవెన్స్ఇవ్వనున్నది. పుడ్, అకామ్ డేషన్‌కు వినియోగించాలని సూచించింది. క్యాంపులలో వాడే లాజిస్టిక్, టేబుల్స్, చైర్ల రెంట్‌కు మరో వెయ్యి రూపాయలు చొప్పున ఇవ్వనున్నారు. వీటిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్రిలీజ్ చేయనున్నారు. టీమ్‌లు స్టే చేసేందుకు మండల, జిల్లా హెడ్క్వార్డర్స్ను ప్రభుత్వం సమకూర్చుతున్నది. డీఎమ్హెచ్వోలతో పాటు పంచాయితీ రాజ్, మున్సిపల్ అధికారులు కంటి వెలుగు కార్యక్రమాన్ని రెగ్యులర్‌గా మానిటరింగ్ చేయనున్నారు.
Also Read....