Kadiyam Srihari: ఇకనైనా అహంకారం తగ్గించుకో కేటీఆర్

by Gantepaka Srikanth |
Kadiyam Srihari: ఇకనైనా అహంకారం తగ్గించుకో కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్(BRS) నేత కేటీఆర్(KTR) చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిరాయింపులపై కోర్టు తీర్పునకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అసలు రాష్ట్రంలో ఫిరాయింపులు ప్రారంభించిందే బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. కేసీఆర్(KCR) కూడా గతంలో అనేక పార్టీలు మారారని గుర్తుచేశారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. అహంకారంతో మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

కాగా, పార్టీ ఫిరాయింపులపై ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్‌ల మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం నడుస్తోంది. పార్టీ ఫిరాయింపులను బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao)లు తీవ్రంగా తప్పుబడుతుంటే.. అసలు ఈ తతంగాన్ని ప్రారంభించిందే తమరు అంటూ కాంగ్రెస్(Congress) నాయకులు కౌంటర్‌లు ఇస్తున్నారు. ఇటీవల ఫిరాయింపులు ప్రోత్సహించం అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ కాంగ్రెస్ నాయకులపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా కడియం స్పందించి కేటీఆర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చారు.

Next Story