- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరంగల్‌లో కడియం కావ్యకు డిపాజిట్ కూడా దక్కదు: బాల్క సుమన్
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. మంగళవారం ఆయన ఓ టీవీ ఛానెల్ డిబేట్‌లో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసు అంతా ఒక బూటకమని.. నిజంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఆధారాలు ఉంటే బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరంగల్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అని అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కడియం కావ్యకు వరంగల్‌లో డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పదవులకు కడియం శ్రీహరి, దానం నాగేందర్ రాజీమానా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరిపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్‌ను కలుస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుంటే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.