80 ఏళ్ల ముసలోడికి ఇవన్నీ అవసరమా? ఆర్.కృష్ణయ్యపై కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు

by Ramesh N |
80 ఏళ్ల ముసలోడికి ఇవన్నీ అవసరమా? ఆర్.కృష్ణయ్యపై కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీజేపీ రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య (R. Krishnaiah) మాటలు ఎవరూ పట్టించుకోవద్దని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ (K.A. Paul) అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక వీడియో విడుదల చేశారు. బీసీ నాయకులందరూ (BC leaders) ఆయనను బహిష్కరించాలని తెలిపారు. ముందు కాంగ్రెస్, తర్వాత టీడీపీ, ఆ తర్వాత వైసీపీ.. ఇప్పుడు బీజేపీ ఎవరు ఆయనకు రాజ్యసభ ఇచ్చి వంద, వేయి కోట్లు ఇస్తే ఆ పార్టీకి మద్దతుగా తిరుగుతాడని ఆరోపించారు. 80 ఏళ్ల ముసలోడికి ఇవన్నీ అవసరమా? సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీసీలకు రాజ్యాధికారం తేవాలని అనేక సార్లు తనతో కలిసినట్లు గుర్తుకు చేశారు. 60 శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం లేదు.. 3 శాతం ఉన్న పాలన చేస్తున్నారు.. మేము బీసీలము బిచ్చగాళ్లమా? అని ఆర్. కృష్ణయ్య అన్నారని వివరించారు. ఇప్పుడు ఆయన బిచ్చగాడు అయిపోలేదా? అని, కృష్ణయ్యతో పాటు ఆయన వెంట ఉండే అనేక బీసీ నాయకులు బిచ్చగాళ్లు అయిపోయారని విమర్శించారు. బీసీ నాయకులారా? బయటకు రండి.. 60 శాతం ఉన్న మనం రాజ్యాధికారం తీసుకరావడానికి ప్రయత్నం చేద్దాం.. ఆర్. కృష్ణయ్యను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed