అది పార్లమెంటా.. హిందూ దేవాలయమా..? కేంద్రంపై KA పాల్ ఫైర్

by Satheesh |
అది పార్లమెంటా.. హిందూ దేవాలయమా..? కేంద్రంపై KA పాల్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ నేడు ఇండియన్ పార్లమెంటును ఓపెన్ చేశారా? హిందూ దేవాలయాన్ని ఓపెన్ చేశారా? అని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ నిలదీశారు. ఓపెనింగ్‌కు దేశంలో అన్ని మతాల వారు ఉన్నారని, కేవలం ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ లీడర్లను పిలిచి పార్లమెంటును ఓపెన్ చేశారని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాలపై కాంగ్రెస్ పార్టీ మాట్లాడగలదా అని ప్రశ్నించారు? ప్రతిపక్ష లీడర్లందరూ బీజేపీ బీ పార్టీలుగా తయారయ్యి నోరు మూసుకొని ఈ విషయాలు ప్రశ్నించడం లేదని విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రధానులు సంవత్సరానికి లక్షల కోట్లు అప్పులు చేస్తే.. నేడు మోడీ నెలకు లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు.

సీఎం కేసీఆర్ 660 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సెక్రటెరియట్ కట్టారని, 3600 కోట్లు పెట్టి గుజరాత్‌లో పటేల్ విగ్రహాన్ని నిర్మించారని, వెయ్యి కోట్లు పెట్టి పార్లమెంటు భవనాన్ని నిర్మించి వేల కోట్లు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. అపోజిషన్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో రాజకీయ లబ్ధి కోసం డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. దేశ రక్షణ కొరకు రాష్ట్ర రక్షణ కొరకు కాంగ్రెస్ 50 సంవత్సరాలు పరిపాలించి దేశానికి ఏమి చేయలేదని ఆరోపించారు.

అందుకే దేశంలోని 29 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను చిత్తు చిత్తుగా ఓడించారన్నారు. గతి లేక కర్ణాటకలో మద్దతు ఇచ్చి గెలిపించామని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ లేదని, ఆంధ్రప్రదేశ్‌లో భూస్థాపితం అయ్యిందన్నారు. కాంగ్రెస్ ఈ దేశాన్ని సర్వనాశనం చేసిందని, మిగిలింది బీజేపీ నాశనం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కుల, కుటుంబ పార్టీలకు గుడ్ బాయ్ చెప్పాలని, తెలుగు రాష్ట్రాలను రక్షించడానికి తనతో చేతులు కలపాలని, కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story