- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CS Shanthikumari : యువ వికాసంలో 9వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు : సీఎస్ శాంతికుమారి
దిశ, వెబ్ డెస్క్ : డిసెంబర్ 4 వ తేదీన పెద్దపల్లి(Peddapalli)లో నిర్వహించే యువ వికాసం(Yuva Vikasam) సభకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హాజరై దాదాపు 9000 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందచేస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ముఖ్యమంత్రి హాజరుకానున్న పెద్దపల్లి సభా ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి(Shanthikumari) సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా శాంతి కుమారి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో యువతకై ప్రత్యేకంగా నిర్వహిస్తున్న యువ వికాసం సభలో ఇటీవల గ్రూప్ IV తోపాటు, ఎంపికైన సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, సింగరేణిలో ఉద్యోగాలు పొందిన వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నియామక పత్రాలను అందచేస్తారని వివరించారు.
ఈ సభలోనే స్కిల్స్ యూనివర్సిటీలో భాగస్వామ్యమయ్యే 7 ఏజెన్సీలతో ఒప్పంద పత్రాలపై సంతకం, డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ప్రారంభోత్సవం, సీఎం కప్ ప్రారంభంతో పాటు వందలాది కోట్ల రూపాయల విలువైన అనేక కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని ఆమె వెల్లడించారు.