- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్ ఫలితాల్లో ‘జలజం’ విద్యార్థుల ప్రభంజనం..
దిశ, మహబూబ్ నగర్: ఉమ్మడి జిల్లాలో ఎంఈసీ, సీఈసీ గ్రూపులకు పెట్టింది పేరు అయిన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జలజం జూనియర్ కళాశాల విద్యార్థులు మంగళవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో తమ సత్తా చాటారు. కళాశాలకు చెందిన పర్వీన్ అనే విద్యార్థిని ద్వితీయ సంవత్సరం ఎంఈసీ ఫలితాలలో 1000 మార్కులకు గాను 986 మార్కులతో, సీఈసీ విభాగంలో బి శ్రావణి అనే విద్యార్థిని 973 మార్కులను సాధించి రాష్ట్ర స్థాయిలో తమ సత్తాని చాటుకున్నారు.
ప్రథమ సంవత్సరం ఎంఈసీ విభాగంలో సోనాల్ కంకణి 500 మార్కులకు గాను 490 మార్కులు, సీఈసీ విభాగంలో ఎన్.విజయ్ కుమార్ 473 మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. వీరితో పాటు కళాశాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించి ఆర్ట్స్ విభాగాలలో తమకు తిరుగులేదు అని నిరూపించుకున్నారు. కాగా అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, విద్యా బోధన చేసిన అధ్యాపకులను కళాశాల డైరెక్టర్ రమేష్ గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు.