- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా జగ్జీవన్ రాం జయంతి
దిశ, తెలంగాణ బ్యూరో : దేశ మాజీ ఉప ప్రధాని బాబుజగ్జీవన్ రాం ఆశయాల సాధనకు అందరం కృషి చేద్దామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పిలుపు నిచ్చారు. ఎన్టీఆర్ భవన్ లో బుధవారం జగ్జీవన్ రాం జయంతిని పురస్కరించుకొని జగ్జీవన్ రావు చిత్రపాటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ కార్మిక పక్షపతి జగ్జీవన్ రాం అని కొనియాడారు. జీవితాంతం పేదలు, పీడిత వర్గాల సంక్షేమం, హక్కుల సాధన కోసం పనిచేసిన పాటుపడ్డారన్నారు. సమసమాజ స్థాపనకోసం జగ్జీవన్ రాం కృషి చేశారన్నారు.
ఎస్సీ, ఎస్టీల ఆర్ధికాభివృద్ధికోసం పాటుపడ్డారని, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అంబేద్కర్, జగ్జీవన్ రాంల కృషి అన్నారు. వీరి స్ఫూర్తితోనే పేద, బడుగు వర్గాలకు న్యాయం చేయాలని ఎన్టీఆర్ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. నేటి తరానికి మహనీయుల చరిత్రను వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్న్ప, టీడీపీ రాష్ట్ర నాయకుడు పొలంపల్లి అశోక్ , మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య, రాష్ట్ర మీడియా కో ఆర్టినేటర్ బియ్యని సురేష్, అజ్మీర రాజునాయక్, షేక్ ఆరీఫ్, వెజండ్ల కిషోర్, సాయితులసీ, రాఘవులు తదితరులు పాల్గొన్నారు.