- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను ఎక్కాల్సిన బస్సు వచ్చినప్పుడు తప్పకుండా ఎక్కుతా.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం జగ్గారెడ్డి గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేవలం బతుకుదెరువు కోసమే ప్రశాంత్ కిషోర్ సర్వే సంస్థ పెట్టుకున్నారని అన్నారు. ఆయనేం పెద్ద గొప్ప వ్యక్తి కాదని చెప్పారు. బతకడానికి ఎవరైనా ఏదో ఒక పనిచేయాలి.. ఆయన వ్యూహకర్తగా పనిచేస్తున్నారని చెప్పారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ పదవి అడగటం తనకు కొత్త కాదని అన్నారు.
అవకాశం వచ్చిన ప్రతి సారి అడుగుతానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రెడ్లలో అవకాశం వస్తే లిస్టులో తాను కూడా తప్పకుండా ఉంటానని తేల్చి చెప్పారు. పీసీసీ మార్పునకు ఇంకా సమయం ఉందని చెప్పారు. ఎంపీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాకే పీసీసీ మార్పు ఉండొచ్చన్నారు. బస్టాండ్‌లో తాను ఎక్కాల్సిన బస్సు వచ్చినప్పుడు ఎక్కుతానని స్పష్టం చేశారు. మందకృష్ణ మాదిగ బీజేపీకి లాభం చేకూరేలా మాట్లాడుతున్నారని విమర్శించారు.