CM రేవంత్‌ రెడ్డికి 100 శాతం మార్కులు

by GSrikanth |
CM రేవంత్‌ రెడ్డికి 100 శాతం మార్కులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎంగా రేవంత్‌కు 100 శాతం మార్కులు ఇస్తానని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్ పవర్ లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉన్నదని వివరించారు. అన్ని వర్గాలకు సమన్యాయం, ప్రజలకు స్వేచ్ఛగా పాలన, సమస్యలు వేగంగా పరిష్కారం వంటివి జరుగుతున్నాయన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా, సీఎంగా రెండు బాధ్యతలను రేవంత్ ఫర్ ఫెక్ట్ గా నిర్వహిస్తున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పీసీసీ, సీఎం ఒక్కరే ఉంటే బాగుంటుందని హైకమాండ్ బలంగా నమ్ముతున్నదని, అందుకే మార్పు లేదన్నారు. అయినా ప్రభుత్వం, పార్టీ లో కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయన్నారు. ఎలాంటి డిస్టబెన్స్ లేవన్నారు. భవిష్యత్ లో పీసీసీ మార్పు చేస్తే, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం ఇస్తే సంతోషిస్తానన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి పరిగణలోకి తీసుకుంటే తాను కూడా రేసులో ఉన్నట్టేనని వెల్లడించారు. హైకమాండ్ కూడా తన అభ్యర్ధిత్వాన్ని పరిగణలోకి తీసుకుంటుందనే నమ్మకం ఉన్నదన్నారు.

ఇక మందకృష్ణ మాదిగ బీజేపీ బౌండరీ లో ఉండి మాట్లాడుతున్నాడన్నారు. మతతత్వ పార్టీకి ఆయన ఎలా? మద్ధతు ఇస్తున్నాడనేది అర్ధం కావడం లేదన్నారు. ఆయన న్యూట్రల్ గా ఉండి ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తామన్నారు. తెలంగాణ లో మాదిగ ను రాజ్యసభ సభ్యుడిని చేయమని బీజేపీని ఆడిగావా..? కేంద్ర మంత్రి చేయాలని డిమాండ్ చేశావా..? బంగారు లక్ష్మణ్ ని నవ్వులపాలు చేసినప్పుడు మంద కృష్ణ కనీసం స్పందించారా? అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు. మీరా కుమార్ స్పీకర్ చేసింది కాంగ్రెస్ కాదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏతులు నరుకుతున్న బీజేపీ వాళ్లేవరు స్వతంత్ర ఉద్యమం లో పుట్టలేదని విమర్శించారు. జిమ్మిక్కులతో అధికారంలోకి రావాలనేది మోడీ, అమిత్ షా విధానం అన్నారు. కిషన్ రెడ్డి అవగాహన లేని కేంద్ర మంత్రి అన్నారు. ఇక సర్వే సంస్థల పీకే ఓసారి బీజేపి అని , మరోసారి కాంగ్రెస్ అంటూ తప్పుడు నివేదికలు ఇస్తున్నాడన్నారు. దేశంలోనూ గ్రాండ్ ఫిక్స్ అయిందని, కేంద్రంలో పవర్ పక్కా అంటూ వ్యాఖ్యానించారు. పీకే బతుకు దెరువు కోసం సంస్థ పెట్టుకొని రాజకీయ నాయకుల ఎమోషన్స్ ను క్యాష్​ చేసుకుంటున్నాడన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ దే పవర్ అంటూ పీకే తన రిపోర్టులు ఇచ్చాడని, కానీ రాష్ట్రంలో ఏమైందనేది? అందరికీ అర్ధమైందన్నారు.

రాహుల్ గాంధీ కుటుంబం ప్రజలకు ఎల్లప్పుడూ సుఖ, సంతోషాలు కలగాలని కోరుకుంటారని జగ్గారెడ్డి చెప్పారు. అధికారం కోసం రాహుల్ అడ్డదారులు తొక్కరన్నారు. కాంగ్రెస్ అధికారంలో వర్షా కాలం లో రాలేదన్నారు. తాము డిసెంబరులో పవర్ లోకి వచ్చామని, అప్పుడు శీతాకాలం సీజన్ ప్రారంభం అవుతుందన్నారు. ఇది బీఆర్ఎస్ వాళ్లకు తెలియదా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ కింగ్ మేకర్ రాహుల్ గాంధీ మాత్రమే అన్నారు. ప్రధాని కావడం ఖాయమన్నారు. కేసీఆర్ ప్రస్టేషన్ తో ఉన్నాడని, అందుకే అవగాహన లేకుండా మాటలు మాట్లాడుతున్నాడన్నారు. రాష్ట్రంలో 12 నుండి 14 ఎంపీ సీట్లు తప్పకుండా గెలుస్తామన్నారు. కొత్త ఉగాది సంవత్సరంలో ప్రభుత్వానికి అవమానం 2 ఉన్నదని, అది కూడా ప్రతిపక్షాల తోనే అని జోస్యం చెప్పారు. రాజ్యపూజ్యం 16 ఉన్నదని, ప్రజలు హ్యాపీగా ఉంటారన్నారు. ఇక పార్టీ ఫిరాయింపులపై తాను మాట్లాడలేనని, తాను కూడా పార్టీలు మారి వచ్చినవాడినేనని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story