మహేశ్ కుమార్ గౌడ్‌కి పీసీసీ ఇవ్వడంపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

by karthikeya |
మహేశ్ కుమార్ గౌడ్‌కి పీసీసీ ఇవ్వడంపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ (Telangana) పీసీసీ అధ్యక్షుడి (PCC President)గా మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Gaud) నియామకంపై ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు జగ్గారెడ్డి తొలిసారి స్పందించారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్న నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి పీసీసీ ఇవ్వకూడదని, ఏఐసీసీ భావించిందని, అందుకే ఎన్ఎస్‌యూఐ (NSUI) నుండి పార్టీ కోసం పని చేసిన బీసీ మహేశ్‌ గౌడ్‌కు ఇచ్చారని జగ్గారెడ్డి అన్నారు. గాంధీ భవన్‌ (Gandhi Bhavan)లో నిర్వహించిన వినాయక చవితి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన పూజ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ (Congress Party)తోనే సాధ్యమని, కాంగ్రెస్‌లో మాత్రమే ఎవరైనా అధ్యక్షుడయ్యే అవకాశం ఉందని చెప్పిన జగ్గారెడ్డి.. బీజేపీ (BJP)లో ప్రెసిడెంట్ కావాలంటే కుదరదు అన్నారు. ఒకవేళ పదవి వచ్చినా.. అది ఎప్పటివరకు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియదని విమర్శించారు. ఇక ప్రాంతీయ పార్టీ (Local Parties)ల్లో వేరే వాళ్లకు అవకాశమే ఉండదని, అయితే తండ్రి, లేకపోతే కొడుకులు, కూతుళ్లకే అధ్యక్ష పదవులు దక్కుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే తనకు ఏ పోస్ట్ వస్తుందనేది తాను మాట్లాడనని, పీసీసీ కావాలనే ఆలోచన మారదని, ఎప్పటికైనా తాను పీసీసీ అవుతానని ధీమా వ్యక్తం చేసిన జగ్గారెడ్డి.. ఈ విషయాన్ని తాను ఇంత స్వేచ్చ (Freedom)గా ఈ విషయం చెప్పగలిగే అవకాశం కాంగ్రెస్‌లో మాత్రమే ఉంటుందని అన్నారు. అందుకే మహేష్ గౌడ్ లాంటి సామాన్యుడిని పిలిచి కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ ఇచ్చిందని, ఇది కాంగ్రెస్ గొప్పతనమని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు.చివరిగా వినాయక చవితి (Ganesh Chaturthi) పర్వదినం సందర్భంగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story