- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బస్తీ దవాఖానాల ఏర్పాటుపై జగ్గారెడ్డికి మంత్రి హరీష్ హామీ
దిశ ప్రతినిధి, సంగారెడ్డి: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేదలకు సేవలు అందిస్తున్న బస్తీ దవాఖానాలను సంగారెడ్డికి మంజూరు చేయాలని స్థానిక ఎమ్యెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గ సమస్యలను మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీ కేంద్రాలైన సంగారెడ్డిలో 31, సదాశివపేటలో 20 పేదల బస్తీలు ఉన్నాయని, అక్కడికి కూడా బస్తీ దవాఖానాలు మంజూరు చేయాలని జగ్గారెడ్డి కోరారు. దీనికి త్వరలోనే బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తామని హరీష్ హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇప్పటికే సంగారెడ్డి పట్టణానికి హజ్‌హౌస్‌ను ప్రభుత్వం మంజూరు చేయగా భూమి పూజ పూర్తయిన సందర్భాన్ని జగ్గారెడ్డి గుర్తు చేశారు. ల్యాండ్ సమస్యల కారణంగా స్థల మార్పు చేశారని, ఆ భవనాన్ని దీన్దార్పంక్షన్హాలు పక్కన నిర్మిస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని మంత్రి ముందుంచారు. సంగారెడ్డి పట్టణంలోని ఈద్గాకు ప్రహరిగోడ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేయాలని జగ్గారెడ్డి మంత్రిని కోరారు.
నల్సాబ్గడ్డ గ్రౌండ్ మైనార్టీలు, ఇతరుల అవసరాలకు ఎంతో ఉపయోగపడుతున్నదన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న సంగారెడ్డి నుంచి పటాన్చెరు వరకు దాదాపుగా 15 చెరువులున్నాయని, వాటిని అద్భుతంగా, ఆహ్లదకరంగా డెవలప్చేయాలని జగ్గారెడ్డి కోరారు. హెచ్ ఎండీఏ పరిధిలోని గ్రామ పంచాయతీలో ఉన్న అక్రమ లేఅవుట్ ప్లాట్లకు, భవనాలకు జిల్లా పరిధిలోని గ్రామ పంచాయతీలో లేఔట్ , బిల్డింగ్ రెగ్యులరైజ్ చేస్తే పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసినట్లు అవుతుందని జగ్గారెడ్డి అభ్యర్థించారు. జగ్గారెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చిన అంశాలను పరిగణంలోకి తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
- Tags
- jagga reddy
- ktr