ట్రాన్స్‌కో, జెన్ కో సీఎండీకి జేఏసీ సమ్మె నోటీసులు..

by Vinod kumar |
ట్రాన్స్‌కో, జెన్ కో సీఎండీకి జేఏసీ సమ్మె నోటీసులు..
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ ఉద్యోగులకు గతేడది ఏప్రిల్ 1వ తేదీ నుంచి రావాల్సిన వేతన సవరణ ప్రకటించాలని పలు దఫాలుగా ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. అంతేకాకుండా 6 శాతం ఫిట్ మెంట్ పెంచుతామని చెప్పి ఇప్పుడు పెంచడం కుదరదని యాజమాన్యాలు చెప్పడంతో సర్కార్, సంస్థలతో తాడోపేడో తేల్చుకోవాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈనెల 24వ తేదీన విద్యుత్ సౌధ ఎదుట ‘మహా ధర్నా’ను విజయవంతం చేశారు.

కాగా యాజమాన్యం బుధవారం చర్చలు నిర్వహించారు. ఈ చర్చలు విఫలం కావడంతో ఉద్యోగుల నిరుత్సాహానికి గురయ్యారన్నారు. దీంతో ఏప్రిల్ 17వ తేదీన సమ్మెకు దిగుతున్నట్లు స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీకి స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ శుక్రవారం సమ్మె నోటీసులు అందజేసింది. ఇప్పటికైనా యాజమాన్యం, ప్రభుత్వం స్పందించి, వేతన సవరణతో పాటు, ఈపీఎఫ్, జీపీఎఫ్, ఆర్టీజన్ సమస్యలు, ఉద్యోగుల న్యాయమైన ఇతర సమస్యలు సత్వరం పరిష్కరించాలని డిమాండ్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed