100 నియోజకవర్గాల్లో ఐటీఐ..ఏటీసీలు : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

by Y. Venkata Narasimha Reddy |
100 నియోజకవర్గాల్లో ఐటీఐ..ఏటీసీలు : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఐటీఐలు లేని అసెంబ్లీ నియోజకవర్గాలను గుర్తించి రిపోర్ట్ సమర్పించాలని..100 నియోజకవర్గాల్లో ఐటీఐ, ఏటీసీలు ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కార్మిక, ఉపాధి శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ గా మారుస్తున్న నేపథ్యంలో సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నారు. ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా సిలబస్ ను అప్ గ్రేడ్ చేయాలని, సిలబస్ మార్పుకు కమిటీని నియమించి నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించాలని ఆదేశించారు. అవసరమైతే స్కిల్ యూనివర్సిటీ సహకారం తీసుకోవాలని సీఎం సూచించారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త ఏటీసీలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. వృత్తి నైపుణ్యం అందించే ఐటీఐ/ఏటీసీ, పాలిటెక్నీక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు.

Next Story

Most Viewed