Vc Sajjanar: పిల్లల‌కు ఇవి నేర్పించ‌డం చాలా అవ‌స‌రం.. దిశ కథనంపై స్పందించిన వీసీ సజ్జనార్

by Ramesh Goud |   ( Updated:2024-08-23 06:10:33.0  )
Vc Sajjanar: పిల్లల‌కు ఇవి నేర్పించ‌డం చాలా అవ‌స‌రం.. దిశ కథనంపై స్పందించిన వీసీ సజ్జనార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సమాజంలో జరిగే నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్ చేశారు. పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహాన కల్పించడం చాలా అవసరమని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఈ పద్దతి ఉపయోగపడుతుందని ట్వీట్ చేశారు. "స్పర్శ, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై పిల్లలకు వివరణ" అంటూ 'దిశ పత్రిక' ప్రచురించిన కథనంపై స్పందించిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. పిల్లల‌కు గుడ్ ట‌చ్, బ్యాడ్ ట‌చ్ గురించి నేర్పించ‌డం చాలా అవ‌స‌రమని, చిన్నారుల‌పై జ‌రిగే లైంగిక దాడులను అరిక‌ట్టడంలో 'గుడ్ ట‌చ్, బ్యాడ్ ట‌చ్‌' ప‌ద్దతి చాలా చ‌క్కగా ప‌నిచేస్తుందని తెలిపారు.

అలాగే బ్యాడ్ ట‌చ్ సంఘ‌ట‌న‌లు త‌మ‌కు ఎదురైన‌ప్పుడు తల్లిదండ్రులకు ఆ విష‌యాన్ని స్వేచ్ఛగా పిల్లలు చెప్పగ‌లుగుతారని, నిందితుల‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఈ ప‌ద్దతి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుందని చెప్పారు. దురదృష్టక‌ర‌మేంటంటే.. చాలా మంది త‌ల్లిదండ్రులు త‌మ బిజీ లైఫ్‌లో ప‌డి పిల్లల పెంప‌కంపై శ్రద్ద చూప‌డం లేదని, చిన్నారులు చెప్పే విష‌యాల‌ను వినే ఓపిక కూడా వారికి ఉంటడం లేదని అన్నారు. పిల్లల విష‌యంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయ‌కుండా.. గుడ్ ట‌చ్, బ్యాడ్ ట‌చ్‌పై వారికి అవ‌గాహ‌న క‌ల్పించాలని సజ్జనార్ కోరారు.

Advertisement

Next Story