ముఖ్యమంత్రిగా రేవంత్.. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క..?

by Satheesh |   ( Updated:2023-12-03 17:13:56.0  )
ముఖ్యమంత్రిగా రేవంత్.. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకరణ కార్యక్రమాన్ని ఈ నెల 9న నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నేతలు చెప్పినా ప్రస్తుత పరిస్థితుల్లో వీలైనంత తొందరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోడానికి ఈ రోజు (ఆదివారం) రాత్రే సమావేశాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు జరిగినటప్పటికీ రేపటికి వాయిదా పడింది. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మాత్రమే ప్రమాణ స్వీకారం చేసి క్యాబినెట్ విస్తరణ కార్యక్రమాన్ని ఈ నెల 9వ తేదీన జరిపేలా ప్రాథమికంగా నిర్ణయం జరిగింది. అందులో భాగంగా రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ నేతలు వివరించి టైమ్ తీసుకోనున్నారు. వీలైతో సోమవారమే ఇద్దరి ప్రమాణ స్వీకారణ కార్యక్రమాన్ని ఫిక్స్ చేసేలా గవర్నర్‌ను కోరనున్నారు.

కాంగ్రెస్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క రాజ్‌భవన్‌లో సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 9న తెలంగాణ రాష్ట్ర చరిత్రకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని పూర్తిస్థాయి క్యాబినెట్ ఏర్పడేలా విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహించేలా కసరత్తు జరుగుతున్నది. సోనియాగాంధీతో పాటు రాహుల్, ప్రియాంక, మల్లికార్జున్ ఖర్గే, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రుల్ని సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలనుకుంటున్నది. రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వీలైనంత తొందరగానే ఈ ప్లానింగ్ వర్కవుట్ అయ్యేందుకు వీలుగా ఆయా స్థాయిల్లో నేతలు కసరత్తు చేస్తున్నారు.

Read More..

తెలంగాణలో జిల్లాల వారీగా పార్టీలకు వచ్చిన సీట్లు ఇవే..!

Advertisement

Next Story

Most Viewed