దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది!.. బీఆర్ఎస్ ట్వీట్ కు కాంగ్రెస్ కౌంటర్

by Ramesh Goud |   ( Updated:2024-05-12 14:15:48.0  )
దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది!.. బీఆర్ఎస్ ట్వీట్ కు కాంగ్రెస్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పదేళ్ల కాలంలో ఉద్యమకారులను గౌరవించని మీరు.. ఉద్యమకారుల పేరు లేవనెత్తడం దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉందని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం ఏది రేవంత్? అని బీఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్ కు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. తెలంగాణ ప్రజల నినాదం నిన్ను నమ్మం రేవంత్ అని, ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఏది రేవంత్?, గ్యారెంటీ ఏది రేవంత్? అంటూ.. గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి తగిన బుద్ది చెబుదాం అంటూ బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది.

దీనికి కాంగ్రెస్ స్పందిస్తూ.. ఏనాడైనా ఉద్యమకారులను గౌరవించాలని ఆలోచన మీ అధ్యక్షుడికి తెలిస్తే కదా అని, పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఉద్యమకారుల కుటుంబాలను గాలికి వదిలేసి.. కేసీఆర్ ఒక్కడే పోరాటం చేస్తే తెలంగాణ వచ్చినట్టు చరిత్రను వక్రీకరించి, ఈరోజు మీరు ఉద్యమకారుల పేరు లేవనెత్తడం దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగానే ఉందని ఎద్దేవా చేసింది. అసలు బడ్జెట్ ప్రవేశపెట్టనే లేదు అప్పుడే తొందరెందుకు? అని ప్రశ్నిస్తూ.. పదేళ్లు అధికారంలో ఉన్న మీకు ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చింది.

Read More...

ఎన్ని కోట్లకు అమ్ముడు పోయారు? కాంగ్రెస్ , బీఆర్ఎస్ సోషల్ వార్!

Advertisement

Next Story