Women trafficking :పాతబస్తీలో గలీజ్​దందా.. కాంట్రాక్ట్​ పెళ్లిళ్ల కోసమేనా?

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-11 05:43:41.0  )
Women trafficking :పాతబస్తీలో గలీజ్​దందా.. కాంట్రాక్ట్​ పెళ్లిళ్ల కోసమేనా?
X

దిశ, చార్మినార్​ : మహిళల శరీర నగ్న చుట్టు కొలతల పట్టికను ప్రదర్శిస్తూ న్యూడ్​ ఫొటోలు తీస్తూ పట్టుబడ్డ బ్రోకర్ సయ్యద్​ హుస్సేన్​అరెస్ట్​ వ్యవహారంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కర్ణాటక నుంచి పాతబస్తీకి పక్కా ప్లాన్‌తో వచ్చి కాంట్రాక్ట్​పెళ్లిళ్ల కోసం భర్త విడిచిపెట్టిన, భర్త చనిపోయి ఒంటరిగా నివసిస్తున్న నిరు పేద మహిళలను సయ్యద్​ హుస్సేన్ టార్గెట్​చేసేవాడు. సదరు మహిళల పేరు, అమ్మ పేరు, బ్లడ్ గ్రూప్, వయస్సు, బరువు, ఎత్తు, బ్రెస్ట్, నడుము సైజుల కొలతల వివరాలను ఓ కాగితం మీద రాయించేవాడు.

మహిళలను న్యూడ్‌గా చేసి కాగితం మీద రాసిన వివరాల నేమ్ ప్లేట్‌ను రెండు చేతులతో సదరు మహిళలు పట్టుకోగా సెల్​ఫోన్‌తో ఫొటోలను చిత్రీకరించేవాడు. అప్పట్లో సయ్యద్​ హుస్సేన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు తిరిగి పోలీసు కస్టడీకి తీసుకుని విచారించగా పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. మహిళల ఫిజిక్ ఆధారంగా ధర ఫిక్స్ చేసే కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా‌కు చెందిన ఓ వ్యక్తి వద్ద సయ్యద్​హుస్సేన్ బ్రోకర్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే కర్ణాటకలో ఇది వరకే రెండు పెళ్లిళ్లు చేసుకుని, ఎనిమిది మంది పిల్లలు ఉన్న సయ్యద్​ హుస్సేన్‌కు పాతబస్తీ వట్టేపల్లితో పాటు ఇతర ప్రాంతాలలో దగ్గరి బంధువులు ఉన్నారు.

వాళ్ల సహకారంతో పక్కా ప్లాన్​ప్రకారమే సయ్యద్ హుస్సేన్ బార్కాస్​సలాల ప్రాంతానికి వచ్చాడు. చార్మినార్​ప్రాంతంలో ఓ మహిళ సయ్యద్​హుస్సేన్‌కు పరిచయమయ్యింది. పెళ్ళిళ్లు అయి భర్త వదిలిపెట్టిన, భర్త మృతిచెందిన మహిళలకు తన వద్దకు పంపిస్తే కాంట్రాక్ట్ పెళ్లిళ్లు చేసి కాసుల వర్షం కురిపిస్తానని నమ్మబలికాడు. దీంతో అతని మాటలు నమ్మిన పలువురు మహిళలు ఒక్కొక్కరుగా సయ్యద్​హుస్సేన్ వద్దకు వచ్చే వారు. సదరు మహిళలకు ఇంతకుముందు ఏమైనా సర్జరీలు జరిగాయా? లేవా? అని తెలుసుకోవడానికి వారికి మాయమాటలతో బురిడీ కొట్టించి మహిళల శరీర సౌష్టవాన్ని తెలిపే కొలతలను తీసుకుని ముఖం కనిపించకుండా న్యూడ్​ ఫొటోలను తీసుకునే వాడు.

సర్జరీలు అయిన మహిళలను సింపుల్‌గా రిజెక్ట్​ చేసేవాడు. ఒక వేళ సర్జరీలు ఏమీ జరుగకుండా ఫిజిక్ నచ్చితే మీ పంట పండినట్టేనని నమ్మించేవాడు. న్యూడ్​ఫొటోలను కర్ణాటకలోని బాస్‌కు పంపేవాడు. ఒక వేళ ఎవరైనా మహిళలు న్యూడ్‌గా ఒప్పుకోక పోతే ఇంతకు ముందు తీసిన నగ్న చిత్రాలను వారికి చూపించి బలవంతంగా ఒప్పించేవాడు. మరి కొంతమంది మహిళలను మీ ఫిజిక్​అసలు పనికి రాదని రిజెక్ట్​ కూడా చేశాడు.

మరి కొంత మంది మహిళలతో నువ్వు ఫ్రెష్​గా స్నానం చేసి, మంచి బట్టలు వేసుకు రావాలని వెళ్ళగొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఒక వేళ గుల్బర్గాలోని తన ఉస్తాద్‌కు మీ ఫిజిక్​ నచ్చితే అతను పాతబస్తీకి వచ్చి మరోమారు చూసుకుని నచ్చితే కాంట్రాక్ట్​ పద్దతిలో పెళ్లిళ్లు జరిపిస్తాడని, అతను ఎక్కడికి చెబితే అక్కడికి వెళ్ళాల్సి ఉంటుందని తెలిపాడు. సదరు బాధిత మహిళలకు బ్రోకర్​సయ్యద్​హుస్సేన్ తన మాయ మాటలతో మభ్యపెట్టినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఒక బాధిత మహిళ మాత్రం బ్రోకర్​సయ్యద్ హుస్సేన్ గలీజ్ దందాను ఓ సామాజిక కార్యకర్త దృష్టికి తీసుకెళ్లింది.

దీంతో డిసెంబర్ 5న ఆమె చాంద్రాయణగుట్ట పోలీసులతో కలిసి డెకాయ్​ఆపరేషన్​ నిర్వహించారు. పోలీసుల ఎంట్రీతో బ్రోకర్​సయ్యద్​హుస్సేన్ వ్యవహారం బట్టబయలు అయ్యింది. అప్పట్లో సయ్యద్​హుస్సేన్‌పై 417, 420, 453 క్లాస్​(బి) సెక్షన్ కింద చాంద్రాయణగుట్ట పోలీసులు కేసును నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఇంకా విచారణ జరగాల్సి ఉండడంతో కోర్టులో పిటీషన్​దాఖలు చేసి సయ్యద్​ హుస్సేన్‌ను పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. సయ్యద్​హుస్సేన్ సెల్‌ఫోన్‌లో 9మంది మహిళల నగ్నచిత్రాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసును చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చిన్నప్పుడు స్కూల్లో ఉపాధ్యాయులు వేసిన శిక్షలు - వాటికి అర్థాలు

Advertisement

Next Story

Most Viewed