Gaddar Awards : ఉగాదికి గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం లేనట్టేనా!

by M.Rajitha |
Gaddar Awards : ఉగాదికి గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం లేనట్టేనా!
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ చలన చిత్రాల(Telangana Films)కు సంబంధించి గద్దర్ అవార్డుల(Gaddar Awards) ప్రదానోత్సవంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు చలనచిత్ర పురస్కారాలకు సంబంధించిన విధివిధానాలను సోమవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పరిశీలించి, ఆమోదం తెలిపారు. త్వరలోనే అవార్డులకు చెందిన పూర్తి వివరాలను ఎఫ్డీసీ(Film Development Corporation) ద్వారా నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు(FDC Chairman DilRaju) ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ఉగాది రోజున ప్రదానం చేసేందుకు నిర్ణయించినప్పటికీ.. పురస్కారాల కోసం వచ్చిన చిత్రాలను ఎంపిక చేయడానికి 30 రోజుల సమయం అయినా పడుతుందని ఎఫ్డీసీ ముఖ్యమంత్రికి తెలియజేసినట్టు సమాచారం. వీటి ఎంపిక ప్రక్రియ పూర్తయి.. వాటిని ప్రభుత్వానికి పంపి ఆమోద ముద్ర వేయించడానికి నెలరోజుల కంటే ఎక్కువ సమయమే పట్టనుండగా.. రానున్న ఉగాదికి అవార్డుల ప్రదానోత్సవం లేనట్టే అని తెలుస్తోంది. ఈ పనులన్నీ శరవేగంగా జరిగితే ఏప్రిల్ లో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం ఉండవచ్చునని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Next Story