- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Tummala: బీఆర్ఎస్ వల్లే రైతులపై రూ.11,145 కోట్ల వడ్డీ భారం: తుమ్మల నాగేశ్వరరావు

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రుణమాఫీ విషయంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao) బీఆర్ఎస్ (BRS) పై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రకటించిన రూ.లక్ష కూడా ఏకకాలంలో రుణమాఫీ (Farmers Loan Waiver) చేయకపోవడంతో వడ్డీ భారం రైతులపై పడిందని ఆరోపించారు. రూ. 11,145 కోట్ల వడ్డీ భారం రైతులపై పడిందన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుటుందని విశ్వసించే ప్రభుత్వం మాది అని అందుకే రాష్ట్ర బడ్జెట్ లో 35 శాతం నిధులను వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు కేటాయించిందని చెప్పారు. బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
జూన్ 1 కల్లా ఆయిల్ పాం ప్రాసెసింగ్ యూనిట్ పూర్తి కావాలి
సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆయిల్ పాం ప్రాసెసింగ్ యూనిట్ జూన్ 1 కల్లా పూర్తి చేసి, ఆయిల్ పాం గెలల ప్రాసెసింగ్ చేపట్టాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. బీచ్‌పల్లి, కల్లూరు గూడెంలలో ప్రాసెసింగ్ ప్యాక్టరీల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ చేపట్టి, పనులు ప్రారంభించాలన్నారు. దీనివల్ల ఆయిల్ పాం సాగు (Farm Oil Cultivation) చేపడుతున్న కొత్త జిల్లాలలో రైతులకు ప్రయోజనం చేకూరడంతో పాటు, కొత్త రైతులు ముందుకు రావడానికి అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా ప్రభుత్వం కేటాయించిన భూములను సంస్థ పేరు మీదకు మార్చుకొని, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్పొరేట్ సంస్థ మాదిరిగా పనిచేసేందుకు వివిధ విభాగాలకు నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించుకునేట్టుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.