ఆర్టీసీ కార్మికులపై ఎందుకు చిన్న చూపు కేసీఆర్: తెలంగాణ బీజేపీ

by Mahesh |   ( Updated:2023-05-01 08:14:24.0  )
ఆర్టీసీ కార్మికులపై ఎందుకు చిన్న చూపు కేసీఆర్: తెలంగాణ బీజేపీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టీసీ కార్మికులపై ఎందుకు చిన్న చూపు కేసీఆర్ అంటూ తెలంగాణ బీజేపీ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పాలనలో ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని మండిపడింది. ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన పొదుపు మొత్తాన్ని కేసీఆర్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించింది. అలాగే ఆర్టీసీ రావాల్సి బకాయిల చెల్లింపుల్లోనూ జాప్యం చేస్తోందని తెలంగాణ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆర్టీసీ యూనియన్లనూ అనుమతించడం లేదని ధ్వజమెత్తింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన పీఆర్వీని కూడా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కార్మికులను ప్రైవేటు కన్సల్టెంట్లనుతో వేధిస్తోందని వెల్లడించింది. సీసీఎస్ బకాయిలు చెల్లించంలోనూ జాప్యం చేస్తోందని, అలాగే కార్మికులపై పని భారం పెంచిందని ప్రభుత్వాన్ని తెలంగాణ బీజేపీ తప్పుబట్టింది. ఇప్పటికైనా తెలంగాణ ఆర్టీసీ కార్మికుల కష్టాలు, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed