తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. నోటిఫికేషన్లపై మంత్రి కీలక ప్రకటన

by Gantepaka Srikanth |
తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. నోటిఫికేషన్లపై మంత్రి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ నిరుద్యోగులకు(Telangana Unemployed) మంత్రి దామోదర్ రాజనర్సింహా(Damodar Raja Narasimha) శుభవార్త చెప్పారు. సోమవారం రాష్ట్ర సచివాలయలో మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ఈ నెలాఖరు వరకు దాదాపు 15 నుంచి 20వేల ఉద్యోగ నోటిఫికేషన్(Job Notifications) ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 55 వేల ఖాళీలను గుర్తించినట్లు చెప్పారు. రేపు జరిగే సబ్ కమిటీలో శాఖల వారీగా లెక్కలు తీయబోతున్నామని అన్నారు. ఆరోగ్యశాఖలో ఐదు వేలు, ఆర్టీసీలో మూడు వేలు, అంగన్ వాడీల్లో 14 వేల ఖాళీలను గుర్తించినట్లు తెలిపారు. రేపటి సమావేశం అనంతరం నెలాఖరు వరకు నోటిఫికేషన్ ఇస్తామని అన్నారు.


సొంత నేతలపై ఆగ్రహం :

రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ(Northern Telangana) నేతల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. హెలికాప్టర్ ఎక్కాలన్నా వాళ్లే... వాటిని కొనాలన్న వాళ్ళే అని కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్ అంటూ నాలుగు హెలికాప్టర్లు కొనాలని సెటైర్లు వేశారు. అంతేకాదు.. హైదరాబాద్ సెంట్రల్ సెక్రటేరియట్‌పై హెలిపాడ్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఏది ఉన్నా.. ఏం కావాలన్నా ఉత్తర తెలంగాణ వైపే ఉన్నాయని అన్నారు. ఇప్పటివరకు సొంతంగా తాను ఒక్కసారి కూడా హెలికాప్టర్ వాడలేదని తెలిపారు.



Next Story

Most Viewed