తెలంగాణలో మెడికల్ సీట్లు పెరగడం హర్షనీయం : మాజీ మంత్రి టీ.హరీశ్ రావు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-16 09:27:14.0  )
తెలంగాణలో మెడికల్ సీట్లు పెరగడం హర్షనీయం : మాజీ మంత్రి టీ.హరీశ్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ సీట్లు గణనీయంగా పెరగడం పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంత్రి హరీశ్ రావు ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో వైద్య విద్యకు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ నిలిచిందని హరీశ్ రావు పేర్కొన్నారు. మెడికల్ సీట్ల సంఖ్యలో దేశంలో అగ్రస్థానంలోకి తెలంగాణ చేరుకుందని ఆయన వెల్లడించారు. నాడు అందని ద్రాక్షగా వైద్య విద్య, నేడు సాధారణ ప్రజలకు చేరువైన వైద్య విద్య అని తెలిపారు. 60 ఏళ్ల ఉమ్మడి పాలనలో 5 మెడికల్ కాలేజీలు ఉండగా, 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆ మెడికల్ కాలేజీల సంఖ్య 34కు చేరిందని అన్నారు.

2014 వరకు తెలంగాణలో 2850 ఎంబీబీఎస్ సీట్లు ఉండేవని.. అవి నేడు 8490 సీట్లకు పెరిగాయని తెలిపారు. ఇది కేసీఆర్ మార్క్ పాలనని, మార్పు పేరు చెప్పి ఎవరూ చెరిపేయలేని ఆల్ టైం రికార్డు అని ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed