- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
INC: బీఆర్ఎస్‌కు సొంత భవనాలు.. గురుకులాలకు అద్దె భవనాలా?.. కేటీఆర్ ట్వీట్‌కు ఎంపీ చామల కౌంటర్
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీకి వందల కోట్లతో సొంత భవనాలు.. గురుకులాలకు అద్దె భవనాలా? అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. గురుకులాల అద్దెలు చెల్లించడానికి పైసలు లేవా? సిగ్గు, సిగ్గు.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ కు స్పందించిన చామల కిరణ్, బీఆర్ఎస్ నేతకు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన.. పేద విద్యార్థులు చదువుకునే గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లోనా కేటీఆర్..? సిగ్గు సిగ్గు అని వ్యాఖ్యానించారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి అన్ని జిల్లాల్లో వందల కోట్లతో ఖరీదైన సొంత భవనాలు కట్టిన బీఆర్ఎస్.. గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు ఎందుకు కట్టలేదు? అని నిలదీశారు.
అంతేగాక ఇతర పార్టీల నేతలను వాస్తవాలు చెప్పకుండా అడ్డుకోవడం పిరికిపంద చర్య కేటీఆర్ అని చామల అన్నారు. కాగా కేటీఆర్ గురుకుల పాఠశాలలకు తాళాలు వేయడంపై స్పందిస్తూ.. ఢిల్లీకి మూటలు పంపేందుకు పైసలు ఉన్నాయి.. కమిషన్లు వచ్చే బడా కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులకు కూడా వేల కోట్లు ఉన్నాయి కానీ పేద విద్యార్థుల చదువుకునే గురుకులాల అద్దెలు చెల్లించడానికి పైసలు లేవా.. సిగ్గు, సిగ్గు అని ఎద్దేవా చేశారు. అలాగే ఇది గురుకులాలు శాశ్వతంగా మూసివేసే కుట్ర లాగా కనబడుతున్నదని కేటీఆర్ ఆరోపించారు.