- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అర్థరాత్రి చెట్టుకు చీరకట్టి.. కెవ్వు కేక!
దిశ, వెబ్‌డెస్క్ : టెక్నాలజీ (technology) పెరిగి కృత్రిమ మనుషుల(robot)ను తయారు చేస్తున్న ఈ రోజుల్లో కూడా ప్రజలు మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్ముతున్నారు. ఓవైపు పూజ, యాగం అంటూ కొందరు దొంగబాబాలు లక్షల రూపాయలు కొల్లగొడుతున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. చేతబడి, బాణామతి,(Black Magic) క్షుద్రపూజలు (occult) అంటూ పగ, ప్రతీకారాలకు పాల్పడుతున్నారు. తాజాగా ములుగు జిల్లాల్లో ప్రజలకు భయభ్రాంతులకు గురి చేసేలా గుర్తు తెలియని దుండగులు అర్థరాత్రి క్షుద్రపూజలు చేశారు. అయితే ఈ పూజలు కొత్తరకంగా ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. స్థానికుల అందించిన వివరాల ప్రకారం..
ములుగు జిల్లా(Mulugu District) వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామ శివారులో అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు క్షుద్రపూజలు చేశారు. ఊరిబయట రోడ్డుకు ఆనుకోని ఉన్న చెట్టుకు చీరకట్టి ఈ క్షుద్రపూజలు చేశారు. చెట్టు(tree)కు చీరకట్టి పసుపు, కుంకుమ, నిమ్మకాయలను పెట్టారు. నల్లకోడిని కోసి రక్తంతో హారతిగా ఇచ్చారు. రోడ్డుపై ముగ్గు వేసి దాంట్లో కుంకుమ, పసుపు, నిమ్మకాయలు, కోడి రక్తంతో క్షుద్రపూజలు చేశారు. తెల్లవారుజామున అటుగా వెళ్లిన గ్రామస్తులు ఆ దృశ్యాలను చూసి తీవ్ర భయాందోళ చెందారు. మూడు బాటల వద్ద ఈ ఘటన జరగడంలో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో కూడా ఇదే ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. తాజాగా చెట్టుకు చీర కట్టి తాంత్రిక పూజలు చేయడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని బెస్తగూడెం గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.