- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్‌కు చుక్కెదురే.. మనుగోడులో పంతం నెగ్గించుకున్న సీనియర్లు
దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కులు వస్తున్నాయి. నల్గొండ సీనియర్లు పంతం నెగ్గించుకున్నారు. ముందు నుంచీ పట్టుబట్టి పాల్వాయి స్రవంతికి టికెట్ ఖరారు చేయించారు. ఉత్తమ్, జానారెడ్డితో పాటుగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా స్రవంతినే పోటీకి దింపాలని అధిష్టానం ముందు డిమాండ్ చేశారు. అయితే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం చల్లమల్ల కృష్ణారెడ్డి వైపు మొగ్గు చూపించారు. మునుగోడు ఉపఎన్నిక సమయంలోనే కృష్ణారెడ్డిని తెరపైకి తీసుకువచ్చారు. ఏఐసీసీ ముందు దాదాపు రెండుసార్లు రాష్ట్ర నేతలు భేటీ అయిన విషయం తెలిసిందే.
మునుగోడు బై పోల్ కు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తేలిపోయింది. హస్తం పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తెగా స్రవంతికి నియోజకవర్గంలో ఉన్న గుర్తింపు దృష్ట్యా.. ఆమెవైపు అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మునుగోడు బైపోల్ కు సంబంధించి పాల్వాయి స్రవంతితో పాటు కృష్ణారెడ్డి, పల్లె రవి, కైలాస్ నేత పేర్లను ప్రతిపాదిస్తూ ఓ నివేదికను పార్టీ అధిష్టానానికి టీపీసీసీ పంపించింది. అయితే పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ఎంపిక చేసేందుకే అధిష్టానం మొగ్గుచూపడం గమనార్హం. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిపై ప్రకటన వెలువడడంతో శనివారం గాంధీ భవన్ లో ఆ పార్టీ ముఖ్య నేతలు భేటీ కానున్నారు. ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు ఆధ్వర్యంలో మీటింగ్ జరుగనుంది. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థిగా అవకాశం దక్కని మిగతా ముగ్గురు అభ్యర్థులకు నేతలు సర్దిచెప్పనున్నారు.
కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిగిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి.. 2014లో చనిపోయాక ఆయన కూతురు పాల్వాయి స్రవంతిరెడ్డి తండ్రి స్థానంలో రాజకీయల్లోకి దిగారు. ఆయన ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి 2014లో పోటీచేసి ఓడిపోయారు. మునుగోడులో పాల్వాయికి గట్టి పట్టుండేది. ఆయన అక్కడ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో మాత్రం ఎన్నికల్లో తండ్రి స్థానంలో స్రవంతి రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కానీ సీపీఐతో పొత్తు కారణంగా కాంగ్రెస్ ఈ సీటును సీపీఐకి కట్టబెట్టింది. దీంతో స్రవంతి రెడ్డి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి.. 20వేలకుపైగా ఓట్లు సాధించుకుని అక్కడ గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి తర్వాత రెండో స్థానంలో నిలిచి సత్తా చాటారు. ఇటీవల రాజగోపాల్ రెడ్డి రాజీనామా, బీజేపీలో చేరడంతో స్రవంతిరెడ్డి మళ్లీ తెరపైకి వచ్చారు. ఈసారి తనకు టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి మొర పెట్టుకున్నారు. పలు సర్వేలు, నల్గొండ ఉమ్మడి జిల్లా సీనియర్ల ఒత్తిడితో స్రవంతి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.
కలిసి నడుస్తారా..?
ఎట్టకేలకు స్రవంతికి టికెట్ ఖరారు చేస్తూ ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆశావాహుల్లో నిరాశ నెలకొంది. ప్రధానంగా బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ తో టికెట్ ఆశించిన కైలాష్, పల్లె రవి అసంతృప్తికి గురవుతున్నారు. వీరిని శనివారం గాంధీభవన్ కు రావాలని సమాచారం పంపించారు. బీసీ వర్గానికి టికెట్ కేటాయిస్తే.. కోమటిరెట్టి వర్గాన్ని దెబ్బ కొట్టుతామని, యాంటీ రెడ్డి వర్గంతో గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు. కానీ, ఏఐసీసీ నుంచి మొండిచేయి చూపించారు. ఈ నేపథ్యంలో ఆశావాహులు కలిసి నడుస్తారా.. అనే అనుమానాలు మొదలయ్యాయి.
చల్లమల్లకు డీసీసీ
ఇక మునుగోడు టికెట్ కోసం ప్రముఖ వ్యాపారవేత్త చల్లమల్ల కృష్ణారెడ్డి కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం కృష్ణారెడ్డికి ఇవ్వాలని ఏఐసీసీకి సూచించారు. మునుగోడు ప్రచారంలో కూడా ఆయన రెండు మండలాలకు ఇంచార్జీగా ఉండి, ప్రచార బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ రాకపోవడంతో కొంత అసంతృప్తికి గురైనట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నుంచి కృష్ణారెడ్డికి సానుకూల సమాచారం పంపించారు. త్వరలోనే నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
సీనియర్ల పంతం
స్రవంతికి టికెట్ ఖరారు కావడంతో.. నల్గొండ ఉమ్మడి జిల్లా సీనియర్లు పంతం నెగ్గించుకున్నారు. ఇటీవల ఏఐసీసీ నేతలతో వరుసగా భేటీ అయిన పార్టీ నేతలు స్రవంతికే టికెట్ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. రేవంత్ రెడ్డి అడ్డుపుల్ల వేయడంతో.. దీనిపై సుదీర్ఘ సమయం తీసుకున్నారు. ఏఐసీసీ భేటీ తర్వాత కూడా సర్వే చేయించారు. ఈ దశలోనే ఉత్తమ్, జానారెడ్డితో పాటుగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా స్రవంతి పేరును సూచించారు. ఎంపీ వెంకట్ రెడ్డి ఇటీవల ప్రియాంకను కలిసి ఇదే అంశంపై చర్చించారు. ఇప్పటి వరకు వెంకట్ రెడ్డి ప్రచారానికి దూరంగానే ఉన్నారు. ఇప్పుడు పంతం నెగ్గడంతో ప్రచారానికి వస్తారనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆర్థికపరమైన అంశాలను చూపిస్తూ కృష్ణారెడ్డికి టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ, కృష్ణారెడ్డిని పోటీకి దింపితే.. అటు స్రవంతితో పాటుగా బీసీ నేతలు కైలాష్, పల్లె రవి నుంచి కూడా వ్యతిరేకత వస్తుందని తేలింది. ఈ నేపథ్యంలోనే స్రవంతిని ఖరారు చేసినట్లు చెప్తున్నారు.
మునుగోడు మళ్లీ గెలువాలి
''మునుగోడు బై పోల్ కు పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఖరారు చేశారు'' అంటూ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ట్విట్టర్ లో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ముకుల్ వాస్నిక్ ఓ ప్రకటన విడుదల చేశారని, సోనియాగాంధీ తీసుకునే ప్రతి నిర్ణయం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి దోహదం చేస్తుందని. అభ్యర్థి ఎంపికపై పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని కూడా అదే స్ఫూర్తితో తెలంగాణ కాంగ్రెస్ జనాల్లోకి తీసుకెళ్లి.. మునుగోడులో మళ్లీ గెలవాలి'' అని ఆకాంక్షిస్తూ మాణిక్కం ఠాగూర్ ట్వీట్ చేశారు.
Also Read : మునుగోడు కాంగ్రెస్‌లో ఆశావాహుల టెన్షన్!
Also Read : యువరాజుకు నో చాన్స్.. సీఎంగా కేటీఆర్‌కు అవకాశం లేనట్లే!