- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఆక్రమించెయ్..! అడ్డెవరు..? అక్కడ అన్నీ అక్రమ నిర్మాణాలే!
దిశ, కూకట్పల్లి: మూసాపేట్ సర్కిల్ అక్రమ నిర్మాణలకు కేంద్రంగా మారింది. అనమతులు ఒకలా తీసుకొని తమకు ఇష్టం వచ్చినట్టు బహుళ అంతస్తులను నిర్మి స్తు కొంత మంది బిల్డర్లు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. 12 నుంచి 15 ఫీట్ల రోడ్డుల్లో ఏకంగా 5 నుంచి 7 అంతస్తుల వర కు నిర్మాణాలు చేపట్టి జీహె చ్ఎంసీ ఖజానాకు గండి కొడుతున్నారు. ఒకటి, రెండు కుటుంబాలు నివా సం ఉండాల్సిన భవనాల్లో పరిమితికి మించి వ్యక్తులు నివాసం ఉంటుండడంతో డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, విద్యుత్ కనెక్షన్, ట్రాఫిక్, రోడ్లపై అక్రమ పార్కింగ్ ఇలా సమస్యల వలయంలో ఆయా కాలనీ లు చిక్కుకొని ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
పెరుగుతున్న భారం
ఆసియా ఖండంలోనే అతి పెద్ద కాలనీగా పేరు గాంచిన కేపీహె చ్బీ కాలనీ నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించింది. కాలనీలో ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీలుగా తరగతులును విడదీసి వంద గజాల నుంచి 300 గజా ల వరకు ప్లాట్లను కేటాయించి హౌసింగ్ బోర్డు శాఖ అప్పట్లో 12 నుంచి 25 ఫీట్ల వరకు రోడ్లను కేటయించి లేఔట్ చేశా రు. 12 ఫీట్ల రోడ్డులో నిర్మించిన బహుళ అంతస్థుల నిర్మాణాల కారణంగా తరచూ డ్రైనేజీ పొం గడం, తాగునీటి సరఫరా సరిపో కపోవడం, విద్యుత్ సమస్యలు, ట్రాఫిక్ సమస్యతో కాలనీ వాసు లు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. కొత్త డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి పైప్‌లైన్ పనులు చేపట్టాలంటే ప్రభుత్వానికి ఇది అద నపు భారంగా మారింది. అసలు ప్రభుత్వ ఖజానాకు గండి పెట్టి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా నిర్మించిన భవనాలు ఉన్న కాలనీల్లో ప్రజా ధనాన్ని వృథా చేస్తూ మౌలిక వసతులు కల్పించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
సవాల్ విసురుతున్న నిర్మాణ దారులు
మూసాపేట్ సర్కిల్ పరిధిలోని కేపీహెచ్‌బీ డివిజన్, బాలాజీ నగర్ డివిజన్లో అక్రమ నిర్మాణాల జోరు కొంత కాలంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. వంద గజాలు, 200 గజాల స్థలంలో ఏకంగా 5, 6, 7 అంతస్థుల వరకు నిర్మా ణాలు చేపడుతున్న నిర్మాణ దారులు అధికారులకు పెద్ద సవాల్‌గా మారారు. కేపీహెచ్‌బీ టెంపుల్ బస్టాప్‌కు సమీపంలోని హెచ్ఐజీ కాలనీలో ఓ వ్యక్తి ఏకంగా 6 అంతస్థుల నిర్మాణం ఎటువంటి నిబంధనలు, సెట్ బ్యాక్‌లు లేకుండా నిర్మాణం చేపడుతున్నాడు. భువజన విజయం మైదానం సమీపంలో కొందరు అనమతలకు విరుద్ధంగా 5, 6 అంత స్తుల నిర్మాణం చేపట్టి జీహెచ్ఎంసీ అధికారులకు సవాల్ విసురుతున్నారు.