పవన్ కల్యాణ్ వస్తేనే కిందికి దిగుతా.. అర్థరాత్రి యువకుడి హల్ చల్

by Ramesh Goud |
పవన్ కల్యాణ్ వస్తేనే కిందికి దిగుతా.. అర్థరాత్రి యువకుడి హల్ చల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పవన్ కళ్యాణ్ వస్తేనే కిందికి దిగుతానని ఓ యువకుడు అర్థరాత్రి హై టెన్షన్ పోల్ ఎక్కాడు. మూడు గంటలు శ్రమించి పోలీసులు అతన్ని కిందని దించారు. కూకట్ పల్లి మాధవరం నగర్ లో సాయి అనే వ్యక్తి గత అర్థరాత్రి హైటెన్షన్ పోల్ ఎక్కి హల్ చల్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కిందికి దిగాలని కోరారు. దీంతో ఆ యువకుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇక్కడికి రావాలని, ఆయన వస్తేనే కిందికి దిగుతానని చెప్పాడు. దీంతో కంగు తిన్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని పోలీసుల సహాయంతో హైటెన్షన్ పోల్ కి నిచ్చెనలు వేసి దించేందుకు ప్రయత్నం చేశారు. దాదాపు 3 గంటలు శ్రమించి ఆ వ్యక్తిని పోల్ నుంచి కిందకి దించారు. అనంతరం పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు.

Advertisement

Next Story